డిసెంబరు 26,27 తేదీల్లో విశాఖ ఉత్సవ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Oct 2019 1:04 PM ISTవిశాఖ : డిసెంబరు 26,27 తేదీల్లో విశాఖ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు ప్రభుత్వ నుంచి రూ.కోటి మంజూరు చేయనున్నట్లు సమాచారం. విశాఖ ప్రాంత విశిష్టతను తెలియజేసి తద్వారా పర్యాటకులను ఆకర్షించేందకు ఈ ఉత్పవ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవ్‌లో స్థానిక కళాకారులకు, క్రీడాకారులకు ప్రాధాన్యత కల్పించనున్నారు. కైలాసగిరిపై ఎంవీఆర్డీఏ ఫ్లవర్ షో, ఎగ్జిబిషన్ స్టాల్స్, కార్నివాల్ ఏర్పాటు చేయనున్నారు. బీచ్‌రోడ్డు, జాతర, వైఎస్సార్ సెంట్రల్ పార్కులో మూడు వేదికలను ఏర్పాటు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు
Next Story