రెండు నెలల క్రితం రికార్డు.. నేడు చెత్త కుప్పలుగా వైజాగ్ బీచ్‌లు
Wrappers to cosmetics: Vizag beaches turn into garbage dumps barely 2 months after world record.బీచ్ క్లీనప్‌లో 2 నెలల
By తోట వంశీ కుమార్ Published on 6 Oct 2022 3:43 PM ISTవిశాఖపట్నం : రెండు నెలల క్రితం బీచ్ క్లీనప్‌లో `వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించిన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు ప్రస్తుతం డంప్ యార్డులుగా చెత్తుకుప్పలతో దర్శమిస్తున్నాయి.
సుమారు రెండు నెలల క్రితం.. ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనప్ డ్రైవ్‌ను నిర్వహించడం ద్వారా రాష్ట్రం "వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"లోకి ఎక్కింది. దాదాపు 22,000 మంది `పార్లే ఫర్ ది ఓషన్స్' సహకారంతో బీచ్‌లో 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. అయితే.. ప్రస్తుతం బీచ్‌లు మళ్లీ చెత్త డంప్‌లుగా కనిపిస్తున్నాయి.
వన్యప్రాణి సంరక్షకుడు, ఫోటోగ్రాఫర్ శ్రీకాంత్ మన్నెపూరి బీచ్‌లలో చెత్తాచెదారంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాల తాజా చిత్రాలను పోస్ట్ చేశారు. జలచరాలపై ప్రభావం చూపే చాక్లెట్ రేపర్లు, ఐస్‌క్రీం కప్పులు, పాల కవర్లు, పెద్ద ప్లాస్టిక్‌ను తెన్నేటి పార్క్ బీచ్, జోగుగులపాలెంలో పారబోస్తున్నారు. బంగ్లాదేశ్ కార్గో షిప్‌ని తేలియాడే రెస్టారెంట్‌గా మార్చిన తర్వాత తెన్నేటి పార్క్ బీచ్ ఇటీవల పర్యాటక ఆకర్షణగా మారింది. 2020లో వచ్చిన తుఫాను సమయంలో ఓడ మునిగిపోయింది.
మానవ నిర్మిత విపత్తు:
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) నగరంలోని బీచ్‌లను పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సాధారణ ప్రజానీకం తన బాధ్యతను విస్మరించినట్లు కనిపిస్తోంది.
"చాలా సంస్థలు బీచ్‌లను శుభ్రం చేయడానికి మరియు అవగాహన కల్పించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినప్పటికీ, చాలా మంది ప్రజలు బీచ్‌లు మరియు ఇతర పర్యాటక ప్రదేశాలలో చెత్తను పారవేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ చెత్తలో ఎక్కువగా టూత్‌పేస్ట్, సౌందర్య సాధనాలు, పాల ప్యాకెట్, షాంపూ కవర్లు మరియు రోజువారీ వినియోగ ఉత్పత్తులు. నీళ్ల సీసాలు అధికంగా ఉన్నాయని అన్నాడు శ్రీకాంత్.
శ్రీకాంత్.. బీచ్‌లంతా ప్లాస్టిక్ వ్యర్థాల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. 'విశాఖపట్నం బీచ్‌లను పాడుచేయొద్దు' అంటూ సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను ప్రారంభించారు.
ప్లాస్టిక్ రహిత మండలాలు
జివిఎంసి అధికారుల ప్రకారం.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం జూన్ 5 నుండి ప్రారంభమైంది. ప్రధాన పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్ రహిత జోన్‌లుగా ప్రకటించారు. ప్రజలు చెత్తను చెత్త డబ్బాల్లో పారవేసేవిధంగా జివిఎంసి పర్యాటక ప్రదేశాలలో సిబ్బందిని కూడా నియమిస్తోంది.
"పర్యాటక ప్రదేశాలలో ప్లాస్టిక్‌ను వేయకూడదని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా బీచ్ క్లీనింగ్ క్యాంపెయిన్‌లు చేపడుతున్నాము. ఇప్పటికైనా చాలా మంది పర్యాటకులు తమ ఆలోచనలను మార్చుకోవాలి. ప్రజలు తమ వైఖరిని మార్చుకోకపోతే.. సీటీని క్లీన్‌గా ఉంచేందుకు మేము త్వరలో కఠిన చర్యలు తీసుకుంటాము.'' అని జీవీఎంసీ కమిషనర్ పి.రాజబాబు అన్నారు
2027 నాటికి ప్లాస్టిక్ కాలుష్య రహిత రాష్ట్రంగా
2027 నాటికి ఏపీని కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చేందుకు `పార్లే ఫర్ ది ఓషన్స్'తో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసేందుకు పార్లీ ఫర్ ది ఓషన్స్ కృషి చేస్తోంది.
భవిష్యత్తు లక్ష్యాలు ఏమిటి?
1. రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన పారిశుధ్యం మరియు వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేయడం మరియు అమలు చేయడం
2. AIR స్టేషన్‌లను అమలు చేయండి - ప్లాస్టిక్‌ను నివారించండి, అడ్డగించండి మరియు రీడిజైన్ చేయండి. ఒక్కో మండలం మరియు స్థానిక సంస్థలకు 500 పైగా AIRలను ఏర్పాటు చేస్తారు
3. ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు 10 ఎకో-ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేయడం.
4. కాలుష్యాన్ని అరికట్టడం.. తీరప్రాంతం వెంబడి, కాలువలు, నీటిపారుదల మార్గాలు మరియు నదీ మార్గాలలో ప్లాస్టిక్ పారవేయడాన్ని అడ్డుకోవడం.
5. సుమారు 20,000 మంది సముద్ర యోధులను సమీకరించడం, వారికి శిక్షణ ఇవ్వడం.
6. 6 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్లు (రూ. 16,000 కోట్ల పెట్టుబడి).
7. ప్రతి ఒక్కరికి కనీసం రూ. 16,000 చెల్లించేలా 20,000 మందికి ఉపాధి కల్పించడం.
8. ప్లాస్టిక్ మరియు రీసైకిల్ మెటీరియల్‌ని ఉపయోగించడానికి కార్పొరేట్ నెట్‌వర్క్ - రీసైకిల్ ప్లాస్టిక్‌ను ఉపయోగించుకోవడానికి కంపెనీలతో కనెక్ట్ అవ్వడం.