విశాఖ: టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
By Srikanth Gundamalla Published on 1 Sept 2023 12:07 PM ISTవిశాఖ: టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్ట్
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన అయ్యన్నపాత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆగస్టు 22న గన్నవరంలో యువగళం సభ నిర్వహించారు అయ్యన్నపాత్రుడు. ఆ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన వాఖ్యలపై మాజీమంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని పోలీసులకు ఫిర్యాదు. ఆయన కంప్లైంట్ మేరకే విశాఖలో దిగగానే అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
గన్నవరంలో ఆగస్టు 22న టీడీపీ ఆధ్వర్యంలో యువగళం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్నపాత్రుడు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్, వైఎస్‌ఆర్‌సీపీ నేతలను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని కృష్ణా జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పేర్ని నాని తన కంప్లైంట్‌లో పేర్కొన్నారు. దాంతో.. అయ్యన్నపాత్రుడిపై పోలీసులు 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇక ఢిల్లీ పర్యటన తర్వాత అయ్యన్నపాత్రుడు విశాఖ చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అయ్యన్నపాత్రుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాకు తరలించారు. అయితే.. అయ్యన్నపాత్రుడి అరెస్ట్ గురించి తెలుసుకున్న టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్‌లు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. కాగా.. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడి ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని తెలుస్తోంది. టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడిని వదిలేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.