విశాఖ జిల్లాలో టెన్షన్.. టెన్షన్!

Series of Accidents in the city Visakhapatnam.ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్న దుర్ఘటనలు

By సునీల్  Published on  3 Aug 2022 6:45 AM GMT
విశాఖ జిల్లాలో టెన్షన్.. టెన్షన్!
  • పరిశ్రమల్లో ప్రమాద ఘంటికలు
  • ఎల్జీ పాలిమర్స్ నుంచి వరుస ఘటనలు
  • కమిటీ నివేదిక ప్రకారం చర్యలు కోరుతున్న ప్రజలు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో తరచుగా చోటు చేసుకుంటున్న దుర్ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. వరుస ప్రమాదాలు విశాఖ న‌గ‌ర‌వాసుల‌తోపాటు ప‌రిస‌ర‌ప్రాంతాల్లో ఉన్న వారికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే పదేపదే విశాఖ‌ప‌ట్నంలో ఇలాంటి భ‌యాన‌క ప్రమాదాలు ఎందుకు సంభ‌విస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఒకవైపు కాబోయే పరిపాలనా రాజధాని విశాఖ అని ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు పదేపదే ప్రచారం చేస్తున్నారు. మరోవైపు వరుసగా జరుగుతున్న ప్రమాదాలు భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

2020 మే 7న జరిగిన విశాఖ పారిశ్రామికవాడలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులు నేటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఆ ప్రమాదంలో 14 మంది మరణించగా, 500 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. ఇంకా వివిధ ఆరోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతూనే ఉన్నారు. అదే ఏడాది జూలై 14న పరవాడలోని రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో జరిగిన భారీ పేలుడు ఇండస్ట్రియల్ సెజ్‌ను ఉలిక్కి పడేలా చేసింది. అయితే ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ప్రాణనష్టం సంభవించిన ప్రమాదాలు జరగనప్పటికీ, ప్రజలు మాత్రం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ ప్రమాదాలకు మాన‌వ త‌ప్పిదాలు, పరిశ్రమల యాజమాన్యాలు భద్రతా చర్యలు సరిగా పాటించకపోవడమే కారణంగా తెలుస్తోంది.

Next Story