ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన కోడికత్తి కేసు విశాఖకు బదిలీ అయింది. తెలుగు రాష్ట్రల్లో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ సాగింది. ఇకపై విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరగనుంది. దీనిపై కోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు.
2018 అక్టోబర్‌లో విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై శ్రీనివాస్ అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేశాడు. దాడికి పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాటి నుండి విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇప్పుడు ఈ కేసును విశాఖకు బదిలీ చేశారు. కేసు విచారణను ఆగస్ట్ 8న నిర్వహించాలని ఆదేశించారు. విచారణను విశాఖ కోర్టుకు బదిలీ చేయడాన్ని నిందితుడు శ్రీనివాస్ తరఫు న్యాయవాది గగన సింధు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో 80 శాతం వాదనలు పూర్తైన తర్వాత మరో ప్రాంతానికి బదిలీ చేయడం సరికాదన్నారు. అయినప్పటికీ తమ వాదనలు ఎక్కడైనా పూర్తిస్థాయిలో వినిపిస్తామని, కేసు కొలిక్కి రావాలంటే జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని గగన సింధు చెప్పారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శ్రీనివాస్ తరుఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం కేసు విచారణకు వచ్చింది.