విశాఖ: వరలక్ష్మీ హత్య కేసులో కీలక విషయాలు.. సీఎం జగన్ సీరియస్
By సుభాష్
విశాఖలోని గాజువాకలో వరలక్ష్మీ హత్య కేసులో కీలక విషయలు బయటకు వస్తున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరలక్ష్మీ హత్యకు ఆమె మరొకరితో సన్నిహితంగా ఉండడమే కారణమని తేలింది. వరలక్ష్మీపైన అనుమానంతోనే ప్రేమోన్మాది అఖిల్ ఆమెను సాయిబాబా ఆలయం వద్దకు పిలిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
కాగా, సుందరయ్య కాలనీలో ఉంటున్న వరలక్ష్మీతో, చిట్టిబాబు కాలనీకి చెందిన అఖిల్ కొన్ని రోజులుగా ప్రేమ వెంట పడ్డాడు. అదే సమయంలో రాము అనే యువకుడు వరలక్ష్మీతో సన్నిహితంగా ఉండటం భరించలేక ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనుమానం పెంచుకున్న అఖిల్ తమ కుమార్తె ప్రాణాలు తీశాడని, ఆయనను కఠినంగా శిక్షించాలని వరలక్ష్మీ తల్లి పోలీసులను కోరుతోంది. తాజా
కాగా, ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అ ంతకు ముందు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వరలక్ష్మీ కుటుంబానికి రూ.10 లక్షల సహాయం ప్రకటించిన సీఎం జగన్
కాగా, ఈ ఘటన విషయంలో వరలక్ష్మీ కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.10 లక్షల సహాయం ప్రకటించారు. ప్రమోన్మాది దారుణానికి బలైన వరలక్ష్మీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎస్, డీజీపీ, ఇంటలిజెన్స్ చీఫ్ నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సీఎం సూచించారు. అలాగే యాప్‌పై అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను అదుపు చేసే విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.