విరుష్క విడాకులు అంటూ ట్విట్టర్ లో మోత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Jun 2020 6:49 AM GMT
విరుష్క విడాకులు అంటూ ట్విట్టర్ లో మోత

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే..! పెళ్లి కాకముందు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. విరాట్ కోహ్లీ కోసం విదేశాలకు వెళ్లడం.. అక్కడ చేతిలో చేయేసుకుని తిరగడం అలా ఆనందంగా గడిపారు. విరాట్ కోహ్లీ సరిగా ఆడకపోతే అనుష్కను తిట్టడం కూడా జరిగింది. ఎన్నో ఘటనలు.. మరెన్నో సంఘటనలు..! అలా ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి అనే బంధంతో ఒకటయ్యారు. విరుష్క పేరుతో ఈ జంట ఎంతో హ్యాపీగా ఉంటోంది. లాక్ డౌన్ లో కూడా ఇద్దరూ తమ తమ ప్రేమను సోషల్ మీడియాలో చూపిస్తూ ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట గురించి సోషల్ మీడియాలో ఓ హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఇంతకూ ఆ హ్యాష్ ట్యాగ్ ఏమిటీ అనే కదా మీ డౌట్..!



#VirushkaDivorce (విరుష్క విడాకులు) అన్నది..! వాళ్లిద్దరూ హ్యాపీగా గడుపుతూ ఉంటే.. ఈ ట్వీట్ ఏంటో అంటూ పెద్ద ఎత్తున చర్చించుకుంటూ ఉన్నారు. ఇలా ట్రెండింగ్ లోకి రావడానికి కారణం ఏమిటో తెలుసా..? ఇద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే ఓ పాత వార్త వైరల్ అవుతూ ఉండడమే. 2016 ఫిబ్రవరి వార్త ఇప్పుడు మళ్లీ ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది.

అనుష్క శర్మ నిర్మించిన పాతాళలోక్ వెబ్ సిరీస్ కొద్దిరోజుల కిందట ఓటీటీలో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని అభ్యంతకరమైన సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కొందరు అనుష్క శర్మపై విమర్శలు గుప్పించారు. ఓ బీజేపీ నేత అయితే ఏకంగా అనుష్క శర్మకు విరాట్ విడాకులు ఇవ్వాలంటూ ఉచిత సలహా ఇచ్చేసాడు.

Next Story