విండీస్‌తో టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకొన్న‌ టీమ్‌ఇండియా వన్డే సమరానికి సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో భారత్‌, విండీస్‌ తొలి వన్డేలో తలపడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాస్‌ గెలిచిన విండీస్‌ కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. టాస్‌ గెలిస్తే మొదట బ్యాటింగ్‌ చేయాలనుకున్నట్లు భారత సారథి విరాట్‌ కోహ్లీ చెప్పాడు.

బ్యాటింగ్‌కు దిగిన‌ టీమిండియా ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చి ఆ నిర్ణ‌యం స‌బ‌బే అని నిరూపించింది. 6ప‌రుగుల‌ వ్యక్తిగత స్కోర్ దగ్గర ఓపెనర్ రాహుల్ అవుటవ్వగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ(4) కూడా వెంట‌నే అవుట‌య్యాడు. భీక‌ర ఫామ్ లో ఉన్న‌ విరాట్ కోహ్లీ అవుట‌వ్వ‌డంతో స్టేడియం అంతా ఒక్క‌సారిగా నిశ్శ‌బ్దం అల‌ముకుంది. విండీస్ బౌలర్ కాట్రెల్ రెండు వికెట్లను తీసుకున్నాడు. క్రీజులో రోహిత్ శర్మ, అయ్యర్ ఉన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story