ఈ సారి కూడా వారిద్ద‌రి మ‌ధ్యే పోటీ.. కానీ కోహ్లీ దాటేశాడు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Dec 2019 6:49 PM IST
ఈ సారి కూడా వారిద్ద‌రి మ‌ధ్యే పోటీ.. కానీ కోహ్లీ దాటేశాడు..!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో ఘ‌న‌త సాధించాడు. తాజాగా.. ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో మ‌రోమారు నంబర్‌ వన్‌ స్థానానికి ఎగ‌బాకాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ అగ్ర‌స్థానంలో ఉన్న‌ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్ పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫ‌లమయ్యాడు.



దీంతో.. స్మిత్ 15 రేటింగ్ పాయింట్లు కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. ఇదే క్రమంలో స్మిత్‌కు 15 పాయింట్ల దూరంలో ఉన్న‌ కోహ్లీ 928 పాయింట్లతో ఆగ్రస్థానానికి ఎగబాకాడు. దక్షిణాప్రికాపై డబుల్‌ సెంచరీ, బంగ్లాదేశ్‌తో జరిగిన డేనైట్‌ టెస్టులో సెంచరీ చేయ‌డం బాగా క‌లిసొచ్చంద‌ని చెప్పొచ్చు.

Image result for steve smith

నిషేదానికి గురై ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్‌ సిరీస్‌తో పునరాగమనం చేసిన స్టీవ్‌ స్మిత్‌.. ఆ సిరీస్‌లో ఏకంగా 774 పరుగులు చేశాడు. దీంతో అప్పటివరకు నంబర్‌ వన్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్న కోహ్లీని.. స్మిత్ వెన‌క్కి నెట్టి తిరిగి నంబర్‌ వన్‌ స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.

అయితే.. తాజాగా పాక్ తో జ‌రిగిన‌ సిరీస్‌లో (4, 36) విఫలమైన స్మిత్ మ‌రోమారు త‌న ర్యాంక్‌ను కోల్పోయాడు. అయితే డిసెంబర్‌ 12నుంచి న్యూజిలాండ్‌తో జరిగబోయే టెస్టు సిరీస్‌లో స్మిత్‌ రాణిస్తే.. కొత్త సంవత్సరంలో స్మిత్ మ‌ళ్లీ త‌న‌ ఆగ్రస్థానాన్ని తిరిగి కైవసం చేసుకునే అవకాశం ఉంది.

Image result for david warner

ఇదిలావుంటే.. పాక్‌పై ట్రిపుల్‌ సెంచరీ సాధించిన వార్నర్ ర్యాంకింగ్స్‌లో 12 నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. వార్నర్‌ ఐదో స్థానానికి చేరుకోవడంతో టీమిండియా టెస్టు టీం వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే 6వ‌ స్థానానికి పడిపోయాడు. ఇక ఇండియా నుండి కోహ్లీ, రహానేలతో పాటు మరో బ్యాట్స్‌మన్‌ పుజారా(4) కూడా టాప్‌ 10లో కొనసాగుతున్నాడు.

ఇక బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్‌ ప్యాట్‌ కమిన్స్‌ 900 పాయింట్లతో ఆగ్రస్థానంలో ఉండ‌గా.. దక్షిణాఫ్రికా బౌలర్‌ కగిసో రబడా 839 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. టీమిండియా నుండి స్టార్‌ బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రా 5, రవిచంద్రన్‌ అశ్విన్ 9, మహ్మద్‌ షమీ 10వ స్థానంలో కొన‌సాగుతున్నారు.

Next Story