టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. పూణే వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. 336 బంతుల్లో 33 ఫోర్ లు, 2 సిక్స్‌ల‌తో తన అత్యధిక స్కోరును తానే అధిగ‌మించాడు. కెప్టెన్ గా తొమ్మిది సార్లు 150కి పైగా స్కోరు చేసి ఆస్ట్రేలియన్ దిగ్గ‌జ‌ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఫ‌లితంగా టెస్టుల్లో 26 వ సెంచరీ నమోదు చేశాడు. కోహ్లీ కెరీర్లో ఇది ఏడవ డబుల్ సెంచరీ. టెస్టుల్లో 7 వేల పరుగుల మైలురాయిని విజయవంతంగా దాటేశాడు. కోహ్లీ విజయాలపై స్పందించిన బీసీసీఐ 'వాట్ ఏ ప్లేయర్' అని ట్వీట్ చేసింది. సచిన్ టెండూల్కర్ కూడా కోహ్లీకి డబుల్ సెంచరీ చేసిన సందర్భంగా కంగ్రాట్స్ చెప్పారు. మొత్తానికి విరాట్ కోహ్లీ వరుస రికార్డులతో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నాడు.సామ్రాట్

Next Story