జొమాటో భయ్యా నువ్వు సూపర్‌.. వరద నీటిలో కూడా నడుస్తూ...

గుజరాత్‌లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  2 Sept 2024 7:30 AM IST
జొమాటో భయ్యా నువ్వు సూపర్‌.. వరద నీటిలో కూడా నడుస్తూ...

గుజరాత్‌లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకంగా పట్టణాలే వరద నీటిలో మునిగిపోయాయి. జనజీవనం స్తంభించి పోయిన విషయం తెలిసిందే. ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్న ప్రభుత్వం, అధికారుల సూచనల మేరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. బయటకు వస్తే ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియక నివాసాలకే పరిమితం అయ్యారు. అయితే.. తాజాగా అహ్మదాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న కుటుంబం కూడా వరద నీటి కారణంగా బయటకు వెళ్లలేక జొమాటోలో ఫుడ్‌ ఆర్డర్ చేసుకుంది. ఇక జొమాటో డెలివరీ బాయ్‌ మాత్రం తన విధి నుంచి తప్పించుకోలేదు. వరద ఉన్నా.. అందులోనే నడుచుకుంటూ వెళ్లాడు. దాదాపుగా నడుం లోతు వరద నీరు ఉంది. ఆ నీటిలో నుంచే ఫుడ్‌ డెలివరీ బ్యాగ్‌ను పట్టుకుని ముందుకు సాగాడు. అపార్ట్‌మెంట్‌లో ఉన్న కొందరు జొమాటో డెలివరీ బాయ్‌ వస్తుండగా వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యతగా తన విధిని నిర్వర్తించిన.. జొమాటో డెలివరీ బాయ్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇక సదురు డెలివరీ బాయ్‌ డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. అతనికి తగిన ప్రోత్సాహకం అందించాలంటూ పలువురు జొమాటో కంపెనీని ట్యాగ్ చేశారు. ఈ మేరకు సదురు కంపెనీ కూడా స్పందించింది. ముందుగా ఆ వీడియోను పోస్టు చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పింది. ఇలాంటి డెడికేషన్‌ డెలివరీ బాయ్స్‌ ఉండటంతో తమ అదృష్టమని పేర్కొంది. అయితే.. ఆ డెలివరీకి సంబంధించిన ఐడీ.. ఇతర డిటెయిల్స్‌ను పంపాలని కోరింది. తద్వారా ఆ డెలివరీ బాయ్‌ను గుర్తించి.. సత్కరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. మరి అతను ఎవరు..? జొమాటో సంస్థ అతని డిటెయిల్స్‌ను పొందిందా? అనేది తెలియాల్సి ఉంది.



Next Story