పెళ్లి దుస్తుల్లోనే కానిస్టేబుల్ పరీక్ష రాసిన వరుడు
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చాలా మంది యువత కలలు గంటారు.
By Srikanth Gundamalla Published on 19 Feb 2024 10:59 AM GMTపెళ్లి దుస్తుల్లోనే కానిస్టేబుల్ పరీక్ష రాసిన వరుడు
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని చాలా మంది యువత కలలు గంటారు. అందు కోసం తమ వంతు కష్టం పడతారు. కష్టపడి ఏళ్ల తరబడి చదువుతారు. ఒక్కసారి ఉద్యోగం సంపాదించింది మంచి లైఫ్‌ను లీడ్ చేయాలనుకుంటారు. అయితే.. మన దేశంలో పోలీసు ఉద్యోగాల కోసం యువత ఎంతో పోటీ పడతారు. పరీక్షలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేందుకు వామప్‌లు చేయడంతో పాటు చదువును కొనసాగిస్తారు. అయితే... ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ యువకుడు పోలీస్ పరీక్ష కోసం ఏకంగా పెళ్లి దుస్తుల్లో వచ్చాడు. అతడిని చూసినవారంతా ముందు షాక్ అయ్యారు. ఆ తర్వాత అతని మాటలను విని శభాష్ అంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లో ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష నిర్వహించారు. మహోబా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కానిస్టేబుల్ పోటీ పరీక్ష రాసేందుకు ప్రశాంత్ యాదవ్ అనే యువకుడు పెళ్లి దుస్తుల్లో వచ్చాడు. సంప్రదాయ దుస్తులు.. చేతులకు గోరింటాకు పెళ్లి పీటలపై నుంచి వచ్చినట్లు కనిపించడంతో అతడిని చూసినవారంతా షాక్ అయ్యారు. అతను హాల్‌టికెట్ చూపిస్తు చెప్పిన మాటలు విన్న స్థానికులు, ఇతర కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రశంసలు కురిపించారు.
పోలీసు ఉద్యోగంలో చేరి ప్రజలకు సేవ చేయాలనేది తన లక్ష్యమని ప్రశాంత్ యాదవ్ చెప్పాడు. పెళ్లి కంటే తన కెరియర్ ముఖ్యమని చెప్పాడు. అందుకే పరీక్ష పూర్తి అయిన తర్వాతే ఏడు అడుగులు వేసేందుకు నిర్ణయం తీసుకున్నానని అన్నాడు. పరీక్ష రాసిన తర్వాత వెళ్లి మూడు ముళ్లు వేయనున్నట్లు తెలిపాడు ప్రశాంత్ యాదవ్. యువకుడి నిజాయితీ.. నిబద్దతను చూసిన వారు ప్రశాంత్‌ను పొగిడుతున్నారు. అతడితో పొటోలు తీసుకున్నారు. సదురు యువకుడికి సంబంధించిన స్టోరీని ఫొటోలతో పాటు సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాడు. లైక్‌లు, షేర్ చేస్తూ నెటిజన్లు అతనికి మద్దతు తెలుపుతున్నారు.