సెల్ఫీ తీసుకుంటూ 60 అడుగుల లోతు లోయలో పడ్డ యువతి.. చివరకు
యువత కొందరు సెల్ఫీల కోసం వివిధ ప్రయత్నాలు చేసి ప్రమాదల బారిన పడుతున్నారు.
By Srikanth Gundamalla Published on 4 Aug 2024 8:00 AM GMTసెల్ఫీ తీసుకుంటూ 60 అడుగుల లోతు లోయలో పడ్డ యువతి.. చివరకు
యువత కొందరు సెల్ఫీల కోసం వివిధ ప్రయత్నాలు చేసి ప్రమాదల బారిన పడుతున్నారు. తాజాగా ఓ యువతి కూడా సెల్ఫీ కోసం ప్రయత్నించి.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది. సెల్ఫీ తీసుకుంటుండగా 60 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని బోరనే ఘాట్‌లో శనివారం చోటుచేసుకుంది. అయితే.. రెస్క్యూ సిబ్బంది వెంటనే స్పందించి ఆ యువతిని కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శనివారం పూణెకు పూణెలోని వార్జేకు చెందిన 29 ఏళ్ల నస్రీన్ అమీర్ ఖురేషీ థోస్‌ఘర్ జలపాతాన్ని సందర్శించింది. బోరాన్ ఘాట్ వద్ద ఆమె సెల్ఫీ తీసుకుంటుండగా జారి 60 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఆమెతో పాటు వచ్చిన ఇతరుల సమాచారం మేరకు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆమెను రక్షించేందుకు రోప్ సహాయక చర్యలను ప్రారంభించారు. కొద్ది గంటల తర్వాత ఆమెను సరక్షితంగా పైకి తీసుకొచ్చారు. ఆమెను పోలీసులు రక్షించిన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చిందనీ..ఆమె అదృష్టం బాగుందంటూ చెబుతున్నారు. కాగా.. నస్రీన్‌కు గాయాలు అయ్యాయనీ.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. ఆ పరిస్థికి కొంచెం సీరియస్‌గా నే ఉన్నట్లు చెప్పారు.
సతారా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దాంతో.. వరదలు భారీ ఎత్తున పొంగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు పర్యాటక ప్రాంతాలు, జలపాతాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ జితేంద్ర దూడి ఆదేశించారు. అయినప్పటికీ కొన్ని ప్రమాదకర ప్రదేశాలకు సందర్శకులు వెళ్తూనే ఉన్నారు. సోషల్ మీడియా ఫేమ్ కోసం ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకునే ధోరణి కొనసాగుతూనే ఉంది.
సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిన యువతి..
— Telugu Scribe (@TeluguScribe) August 4, 2024
యువతి ప్రాణాల మీదికి తెచ్చిన సెల్ఫీ సరదా..
మహారాష్ట్ర - సతారా జిల్లా బోర్నె ఘాట్‌కు వెళ్లిన స్నేహితులు అక్కడి లోయ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు.
అయితే వారిలో ఓ యువతి ప్రమాదవశాత్తు జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.… pic.twitter.com/3QRL2pL9jR