Viral video: డిస్కౌంట్‌ శారీ సేల్‌.. చీర కోసం కొట్టుకున్న మహిళలు

బెంగళూరులోని ఓ రిటైల్ స్టోర్‌లో ఇయర్లీ శారీ సేల్‌ నిర్వహించింది. అక్కడ చీర కోసం ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

By అంజి  Published on  24 April 2023 1:45 PM IST
Bangalore,  saree sale, Malleshwaram

Viral video: డిస్కౌంట్‌ శారీ సేల్‌.. చీర కోసం కొట్టుకున్న మహిళలు

మన దేశంలోని మహిళలకు చీరలంటే చాలా ఇష్టం అన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఎక్కడైనా సేల్‌ ఆఫర్‌, డిస్కౌంట్‌ ఆఫర్‌, బై వన్‌ గెట్‌ వన్‌ అని ఆఫర్లు కనబడితే.. వెంటనే షాపింగ్‌కు చెక్కేస్తుంటారు. ఇక తాజాగా బెంగళూరులోని ఓ రిటైల్ స్టోర్‌ ఇయర్లీ శారీ సేల్‌ నిర్వహించింది. అక్కడ చీర కోసం ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవ యొక్క వీడియో కెమెరాలో బంధించబడింది. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలోని మైసూర్‌ సిల్క్‌ శారీ సెంటర్‌.. ఇటీవల ఇయర్లీ శారీ సేల్‌ నిర్వహించింది.

దీంతో చీరల కొనుక్కునేందుకు మహిళలు షాపింగ్‌ మాల్‌కు పోటేత్తారు. ఈ క్రమంలోనే ఓ చీర ఇద్దరికి నచ్చింది. దీంతో నాక్కావాలంటే.. నాక్కావాలంటూ ఇద్దరూ కొట్టుకున్నారు. వైరల్ వీడియోలో.. చీరలు కొనుగోలు చేసే మహిళల గుంపులతో దుకాణం నిండిపోయింది. అకస్మాత్తుగా, వెనుకవైపు ఉన్న ఇద్దరు స్త్రీలు తీవ్ర వాగ్వివాదంతో పాటు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక ఆ మహిళలను షాపింగ్‌ మాల్‌లోని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మహిళలు ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకోవడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించారు.

Next Story