Video Viral: పెంపుడు మేకతో రైలు ఎక్కిన మహిళ.. టీటీ టికెట్‌ అడగడంతో..

ఓ మహిళ తన పెంపుడు మేకతో రైలు ఎక్కిన వీడియో వైరల్ అవుతోంది. టీటీ మహిళను టికెట్ అడిగితే, ఆమె సమాధానం విని టీటీ నవ్వుకున్నాడు.

By అంజి  Published on  6 Sep 2023 4:27 AM GMT
goat, Train tickets, Indian Railways

Video Viral: పెంపుడు మేకతో రైలు ఎక్కిన మహిళ.. టీటీ టికెట్‌ అడగడంతో..  

భారతీయ రైల్వే దేశంలో అత్యంత ముఖ్యమైన రవాణా మార్గం. టికెట్‌ ఛార్జీలు తక్కువగా ఉండటంతో సామాన్యులు, పేదలు ఈ రైల్వే సేవలను వినియోగించుకుంటున్నారు. ప్రతి రోజు కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఇక రైళ్లలో తరచూగా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇటీవల ఓ వ్యక్తి కదులుతున్న రైలులో పానీ పూరీని విక్రయిస్తున్న వీడియో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఓ మహిళ తన పెంపుడు మేకతో రైలు ఎక్కిన వీడియో వైరల్ అవుతోంది. టీటీ మహిళను టికెట్ అడిగితే, ఆమె సమాధానం విని టీటీతో పాటు అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. రైలులో ఒక వృద్ధ మహిళ మేకతో నిలబడి ఉంది. ఇంతలో టికెట్ చెక్ చేసే టీటీ ఆమె దగ్గరకు వచ్చాడు.

టిటి టికెట్ అడిగితే ఆ మహిళ టికెట్ లో ముగ్గురిని చూపించింది. మేకతో ఆమె, మరొక వ్యక్తికి తీసుకున్న టికెట్‌ చూపించింది. మేక కూడా తీసుకున్న టిక్కెట్టు చూసిన టీటీకి నవ్వొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ప్రజల నుంచి స్పందన వస్తోంది. ఈ వీడియోను చూసిన తర్వాత ఒక ట్విట్టర్ వినియోగదారు ఇలా రాశారు.. 'ఇలాంటి వ్యక్తులు ఈ దేశానికి గర్వకారణం. సింపుల్, హానెస్ట్ ఇండియన్!' అతుల్ అనే ట్విట్టర్ వినియోగదారు ఇలా వ్రాశాడు, 'మేక ఆమెకి జంతువు మాత్రమే కాదు. ఇది ఆమె కుటుంబంలో భాగం, ఎవరైనా కుటుంబ సభ్యులతో ఎలా ప్రవర్తిస్తారు. స్త్రీల నుండి ప్రజలు చాలా నేర్చుకోవాలి. 'ఇక్కడ ధనవంతులు దేశాన్ని దోచుకుని పారిపోతారు, పేదలు మేకలకు కూడా టిక్కెట్లు కొని ప్రయాణం చేస్తారు' అని మరొకరు రాశారు.

ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు, 'మహిళ ప్రతిదీ సరిగ్గా చేసింది, ఆమె కూడా మనోహరమైనది, కానీ మేక రైలు అపరిశుభ్రం చేస్తుంది, అప్పుడు, ఎవరు శుభ్రం చేస్తారు?' 'మహిళ తప్పు చేసిందా లేదా అనేది వేరే విషయం, కానీ ఆమె నిజాయితీగా మేకకు కూడా టిక్కెట్ తీసుకుంది, ఆమె చాలా ఫన్నీ' అని ఒకరు రాశారు. ఈ వీడియో ఎక్కడిది అనేదానికి సంబంధించిన సమాచారం లేదు, కానీ ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేయబడుతోంది. వీడియో చూసిన తర్వాత, ఆ మహిళ యొక్క చిరునవ్వు , నిజాయితీని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

Next Story