వందే భారత్‌ ఆహారంలో బొద్దింక.. క్షమాపణలు చెప్పిన రైల్వే

రైళ్లలో అందించే ఆహారం నాణ్యతపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి.

By అంజి  Published on  20 Jun 2024 3:45 PM IST
Vande Bharat, passenger, cockroach, food, Railways , IRCTC

వందే భారత్‌ ఆహారంలో బొద్దింక.. క్షమాపణలు చెప్పిన రైల్వే

రైళ్లలో అందించే ఆహారం నాణ్యతపై ప్రయాణికుల నుంచి ఎప్పుడూ అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. భోజనం బాగోలేదనో, ఏవైనా పురుగులు పడటం వంటి ఫిర్యాదులు అందుతూనే ఉంటాయి. ఎన్ని ఫిర్యాదులు అందినా మార్పు మాత్రం రావడం లేదు. మళ్లీ మళ్లీ ఇలాంటి ఘటనలే తరచూ రిపీట్‌ అవుతున్నాయి. తాజాగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అధికారిక ఎక్స్‌ ఖాతా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో భోపాల్ నుండి ఆగ్రాకు ప్రయాణిస్తున్న సమయంలో వడ్డించిన ఆహారంలో 'బొద్దింక'ని కనుగొన్న జంటకు క్షమాపణలు చెప్పింది.

విదిత్ వర్ష్నే అనే ఎక్స్‌ యూజర్‌.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తన మామ, అత్తకు అందించిన భోజనంలో బొద్దింక వచ్చిందని ఆరోపిస్తూ కోపంతో కూడిన ఫిర్యాదును పోస్ట్ చేసారు.

“18-06-24 న, మా మామ, అత్త వందే భారత్‌లో భోపాల్ నుండి ఆగ్రాకు ప్రయాణిస్తున్నారు. @IRCTCofficial నుండి అందించిన వారి ఆహారంలో 'బొద్దింక' వచ్చింది. దయచేసి విక్రేతపై కఠిన చర్యలు తీసుకోండి. ఇది మళ్లీ జరగకుండా చూసుకోండి. @RailMinIndia @ AshwiniVaishnaw @RailwaySeva" అని విదిత్ తన పోస్ట్‌లో 69,000 వీక్షణలతో వైరల్ అయ్యింది. విదిత్ పోస్ట్‌ను షేర్ చేసిన రెండు రోజుల తర్వాత.. ఐఆర్‌సిటీసీ క్షమాపణలు చెప్పింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై “సరియైన జరిమానా” విధించబడిందని కూడా తెలిపింది.

“సార్, మీకు కలిగిన ప్రయాణ అనుభవానికి మేము క్షమాపణలు కోరుతున్నాము. విషయం తీవ్రంగా పరిగణించబడింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌కు తగిన జరిమానా విధించబడింది. మేము ఉత్పత్తి, లాజిస్టిక్స్ పర్యవేక్షణను కూడా తీవ్రతరం చేసాము” అని ఐఆర్‌సిటీసీ తెలిపింది. విదిత్ ఫిర్యాదుపై ప్రయాణీకులకు మద్దతు కోసం అధికారిక ఖాతా అయిన రైల్వే సేవా కూడా స్పందించింది.

Next Story