పేపర్లు ప్రింట్ తీసి ఇచ్చాక డబ్బులు అడిగాడు.. కానిస్టేబుల్ ఏమి చేశాడంటే

యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఓ వ్యక్తిని పలుమార్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By M.S.R
Published on : 6 April 2023 4:00 PM IST

UttarPradesh, constable slaps man

పేపర్లు ప్రింట్ తీసి ఇచ్చాక డబ్బులు అడిగాడు.. కానిస్టేబుల్ ఏమి చేశాడంటే  

యూపీ పోలీస్ కానిస్టేబుల్ ఓ వ్యక్తిని పలుమార్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనసేవా కేంద్రంలో పని చేసే వ్యక్తిని పట్టుకుని కొట్టాడు. ఆ వ్యక్తి కొన్ని పేపర్లు ప్రింట్ తీసి ఇచ్చాడు. అందుకు డబ్బులు ఇవ్వాలని కానిస్టేబుల్‌ను అడగడమే అతడు చేసిన తప్పు. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ కానిస్టేబుల్‌ అతనితో వాగ్వివాదానికి దిగి పలుమార్లు చెంప మీద కొట్టాడు. కానిస్టేబుల్‌ పై డిపార్ట్‌మెంట్ విచారణకు ఆదేశించామని మెయిన్‌పురి ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

Next Story