సమోసా దుకాణంలో గొడవ.. కర్రలు, ఇటుకలు, గరిటెలతో కొట్టుకున్నారు.. (VIDEO)

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో డబ్బుల విషయంలో అల్పాహార దుకాణం (స్నాక్స్ షాప్) వద్ద ప్రారంభమైన చిన్న వివాదం రెండు వర్గాల మధ్య వీధి పోరాటంగా మారింది.

By -  అంజి
Published on : 28 Sept 2026 7:17 AM IST

Hapur street brawl video, Uttar Pradesh snack shop fight, Dhaulana police station Dehra village, viral video India fight, Munesh Chandra Pilkhuwa CO

సమోసా దుకాణంలో గొడవ.. కర్రలు, ఇటుకలు, గరిటెలతో కొట్టుకున్నారు.. (VIDEO)

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో డబ్బుల విషయంలో అల్పాహార దుకాణం (స్నాక్స్ షాప్) వద్ద ప్రారంభమైన చిన్న వివాదం రెండు వర్గాల మధ్య వీధి పోరాటంగా మారింది. కర్రలు, ఇటుకలు, బ్యాట్లు, చివరకు సమోసాలు వేయించే పెద్ద గరిటెతో సహా దొరికిన వస్తువులతో పరస్పరం దాడి చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి.

హాపూర్ జిల్లాలోని ధౌలానా పోలీస్ స్టేషన్ పరిధిలోని దెహ్రా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ అయిన వీడియోలో అర్ధ డజనుకు పైగా వ్యక్తులు నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుంపుగా దాడి చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. లాఠీలు, ఇటుకలు, క్రికెట్ బ్యాట్లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఓ వ్యక్తి దుకాణంలో సమోసాలు వేయడానికి ఉపయోగించే పెద్ద గరిటెను ఆయుధంగా పట్టుకుని హల్ చల్ చేశాడు. ఈ క్రమంలో కొందరు మహిళలు సహా స్థానికులు వారిని ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ ఇరువర్గాలు వెనక్కి తగ్గకుండా దాడులు కొనసాగించాయి.

ఈ ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ధౌలానా పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. వీడియో ఆధారంగా ఘర్షణకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఒకే వర్గానికి చెందిన ఇద్దరి మధ్య డబ్బుల లావాదేవీల విషయంలో ఈ ఘర్షణ జరిగినట్లు పిల్ఖువా సర్కిల్ ఆఫీసర్ మునేష్ చంద్ర తెలిపారు. ఇద్దరు గాయపడినట్లు ధృవీకరించామని, వైరల్ వీడియో సాయంతో నిందితులను గుర్తించి త్వరలోనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా శాంతికి భంగం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Next Story