టోల్ ఫీజు అడిగారు.. టోల్ గేట్ ను లేపేశాడు!

టోల్ ఫీజు అడిగినందుకు ఏకంగా టోల్ గేట్ నే లేపేయడానికి ఓ బుల్డోజర్ డ్రైవర్ ప్రయత్నించాడు.

By M.S.R  Published on  11 Jun 2024 1:15 PM GMT
uttar pradesh,  bulldozer driver,  toll plaza ,

టోల్ ఫీజు అడిగారు.. టోల్ గేట్ ను లేపేశాడు! 

టోల్ ఫీజు అడిగినందుకు ఏకంగా టోల్ గేట్ నే లేపేయడానికి ఓ బుల్డోజర్ డ్రైవర్ ప్రయత్నించిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. హాపూర్‌లోని టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లించమని అడగ్గా.. బుల్డోజర్ డ్రైవర్ తన భారీ వాహనంతో విధ్వంసానికి దిగాడు. పిల్ఖువా టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

“హాపూర్ పోలీసులకు ఈ ఘటనపై సమాచారం అందింది. వీడియోలలో JCB డ్రైవర్ పిల్ఖువా టోల్ ప్లాజాను ధ్వంసం చేయడం కనిపించింది. మేము అతనిని అరెస్టు చేశాం. అతని జేసీబీని కూడా స్వాధీనం చేసుకున్నాము, ”అని హాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అభిషేక్ వర్మ తెలిపారు. ఘటనా స్థలం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన డ్రైవర్ ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశాడని పోలీసులు తెలిపారు. పిల్ఖువా పోలీస్ స్టేషన్ లో డ్రైవర్‌పై ఐపిసి సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేశారు.


Next Story