పెళ్లి భోజనంలో లెగ్‌పీస్ రాలేదనీ.. కుర్చీలు విరిగేలా కొట్టుకున్నారు! (వీడియో)

పెళ్లిళ్లలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి.

By Srikanth Gundamalla  Published on  26 Jun 2024 12:00 PM IST
uttar pradesh, fight,  leg piece,  marriage,

పెళ్లి భోజనంలో లెగ్‌పీస్ రాలేదనీ.. కుర్చీలు విరిగేలా కొట్టుకున్నారు!(వీడియో)

పెళ్లిళ్లలో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి. ఇదంతా సహజమే కానీ.. కొన్నిసార్లు జరిగే చిన్నచిన్న గొడవలు రచ్చకు దారి తీస్తాయి. పెళ్లిని పెటాకులు చేసేంత వరకు తీసుకెళ్తాయి. తాజాగా ఉత్తర్‌ ప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ పెళ్లి వేడుకలు తనకు భోజనంలో లెగ్‌పీస్‌ రాలేదనీ గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత చినిచినికి గాలివానై పెళ్లి రద్దు అయ్యే వరకు వెళ్లింది. కుర్చీలను మడతపెట్టి మరీ కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్తాజ్ బరాత్‌ఘర్‌లో ఇటీవల ఓ వివాహ వేడుక జరిగింది. పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. వివాహ వేడుక కోసం అందరూ మండపానికి వెళ్లారు. వరుడు, వధువు తరఫు బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. అయితే.. ఒక వైపున భాజాభజంత్రీలు కొనసాగుతున్నాయి. మరోవైపు భోజనాలను పెడుతూనే ఉన్నారు. వరుడి తరపు వారికి భోజనం వడ్డించే సమయంలో ఓ వ్యక్తికి ప్లేట్‌లో చికెన్ లెగ్ పీస్ రాలేదు. దీంతో అతను భోజనం వడ్డించిన వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ వివాదం గాలివానలా తయారైంది. విషయం తెలుసుకున్న వరుడు కూడా వారికి తోడవ్వడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. చివరకు రెండు వైపుల వారు కుర్చీలతో కొట్టుకున్నారు. దాంతో.. కొందరు పెద్దలు కలుగజేసుకుని వారికి సర్దిచెప్పారు. వరుడి కుటుంబ సభ్యులు మొదట ఏకంగా పెళ్లినే రద్దు చేసుకోవాలని భావించారు. అయితే.. ఈ గొడవలో అక్కడున్న కొందరు పెద్దలు కలుగ చేసుకుని నచ్చచెప్పారు. దాంతో.. చివరకు ఎలాగోలా పెళ్లి యథాతథంగా జరిగింది.

దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని తెలుస్తోంది. పెళ్లిలో కొందరు గొడవ పడి చితకబాదుకున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు వివిధ రకాలుగా ఈ వీడియోపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story