కోల్‌క‌తాలోని ఐఐఎంలో కనిపించిన దృశ్యం.. వైర‌ల్‌

రెండు సరీసృపాల మధ్య జరిగిన భీకర పోరుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2023 8:19 AM GMT
Reptiles Fight,  IIM Kolkata

reptiles fight

రెండు సరీసృపాల మధ్య జరిగిన భీకర పోరుకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఐఐఎం కోల్‌కతా క్యాంపస్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద షేర్ చేశారు. ఇప్ప‌టికే రెండు లక్ష‌ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

ఈ సరీసృపాలు పోరాడుతున్నప్పుడు క్యాంపస్‌లో ఉన్న వ్యక్తి వీడియో రికార్డ్ చేశాడు. అతను జంతువులను గుర్తించి ఈ వీడియోను రికార్డ్ చేశాడు.

‘‘కోల్ కతాలోని ఐఐఎంలో ఉదయమే కనిపించిన దృశ్యం ఇది. వివాదాల్లో ఎలా నెగ్గుకు రావాలో నేర్చుకోవచ్చు’’ అంటూ నందా ట్వీట్ చేశారు.

‘‘నీటి మడుగు ఒడ్డున రెండు పెద్ద లిజార్డ్ లు (రాక్షస బల్లులు, మొసళ్ల రూపంలో ఉన్న) మల్లయుద్ధం మాదిరిగా కలబడుతుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. అచ్చం మనుషుల మాదిరే ఇవి గొడవపడుతున్నాయి. ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. తమ ప్రాంతంలో ఆధిపత్యం కోసం లేదంటే ఆడ లిజార్డ్ కోసం ఇవి ఫైటింగ్ చేసుకుంటున్నాయో అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా.. సంతానం కోసం అయితే అవి కలబడవని, ఆ సమయంలో నేలపైనే ఉంటాయని మ‌రో యూజర్ కామెంట్ పెట్టాడు.

ఇవి ఏ మాత్రం హానీ చేయ‌వ‌ని, ఐఐఎం క్యాంపస్ లో దశాబ్దాలుగా ఉన్నాయని ఇంకొ యూజర్ పేర్కొన్నాడు.

Next Story