ఇంజన్‌ లేకుండా 3 కి.మీ ముందుకెళ్లిన బోగీలు.. వైరల్‌ వీడియో

ట్రాప్‌పై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ఉన్నట్లు బోగీలు విడిపోయాయి.

By Srikanth Gundamalla  Published on  7 May 2024 6:01 AM GMT
train coaches,  engine,  punjab, viral video,

 ఇంజన్‌ లేకుండా 3 కి.మీ ముందుకెళ్లిన బోగీలు.. వైరల్‌ వీడియో 

కొంతకాలంలో ఇండియన్‌ రైల్వేలో ఘోర ప్రమాదాలు సంభవించాయి. కొన్ని ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. ఇంకొన్ని సార్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తాజాగా పంజాబ్‌ రాష్ట్రంలో మరోసారి ఇండియన్ రైల్వేలో కలకలం రేపింది. ఓ రైలు ప్రమాదం తృటిలో తప్పిపోయింది. ట్రాప్‌పై వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి ఉన్నట్లు బోగీలు విడిపోయాయి. రైల్వే అధికారులు, సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ సంఘటన పంజాబ్‌లో ఈ నెల 5వ తేదీన చోటు చేసుకుంది. పాట్నా నుంచి జమ్మూలోని తావికి వెళ్తున్న అర్చన ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ట్రైన్‌ నెంబర్‌ 12355 కోచ్‌లు ఇంజన్‌ నుంచి ఉన్నట్లుండి విడిపోయాయి. ట్రైన్‌లో ఉన్నవారికి ముందుగా ఈ విషయం తెలియదు. ఇంజిన్ లేని కోచ్‌లను గమనించిన కీమ్యాన్‌ వెంటనే అలారం మోగించాడు. దాంతో.. ఆందోళన చెందిన ప్రయాణికులు ఏమైందా అనుకున్నారు. అసలు విషయం తెలుసుకుని భయపడిపోయారు. ట్రైన్‌ ఇంజిన్‌ లేకుండానే దాదాపు 3 కిలో మీటర్ల వరకు ప్రయాణించింది.

ఇక వెంటనే అప్రమత్తం అయిన రైల్వే సిబ్బంది బోగీలు లేకుండా ముందుగా వెళ్తున్న ఇంజిన్‌కు సమాచారం అందించారు. ఆ తర్వాత బోగీలను కూడా ఆపేశారు. ట్రైన్‌ స్పీడ్‌ అందుకోక ముందే ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. అందుకే కొద్దిదూరం వెళ్లి బోగీలు ఆగిపోయాయని అధికారులు అంటున్నారు. ఇక స్పీడ్‌గా ఉన్న సమయంలో బోగీల నుంచి ఇంజిన్ విడిపోయి ఉంటే ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక చివరకు ఇంజిన్‌ను బోగీల వద్దకు రప్పించి.. అటాచ్‌ చేసి పంపించేశారు. ఇక ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Next Story