ట్రాఫిక్‌ బూత్‌లో మద్యం బాబుల హల్‌చల్, వీడియో వైరల్

ట్రాఫిక్‌ జంక్షన్లలో ట్రాఫిక్‌ పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూత్‌ను పోకిరీలు తమ అడ్డాగా మార్చుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  24 July 2023 6:00 PM IST
traffic booth, Liquor Drinking, Hyderabad, viral

ట్రాఫిక్‌ బూత్‌లో మద్యం బాబుల హల్‌చల్, వీడియో వైరల్

పోకిరీలు నిబంధనలు అతిక్రమించి ప్రవర్తిస్తుంటారు. మద్యం సేవించేందుకు ఎన్నో బార్లు ఉన్నా.. బహిరంగ ప్రదేశాల్లో సేవిస్తుంటారు. తాజాగా ఇద్దరు వ్యక్తులు ఏకంగా ట్రాఫిక్‌ పోలీసుల బూత్‌లోనే కూర్చొని ఏం చక్కా మద్యం సేవించారు. పరుగెడుతున్న సిటీని చూస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ డ్రింక్‌ చేశారు. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు.. మన హైదరాబాద్‌లోనే. అదికూడా నిత్యం రద్దీగా ఉండే మాదాపూర్‌లో. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్రాఫిక్‌ జంక్షన్లలో ట్రాఫిక్‌ పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూత్‌ను పోకిరీలు తమ అడ్డాగా మార్చుకున్నారు. పోలీసులు లేని సమయంలో బూత్‌లో చేరి మద్యం సేవించారు. మాదాపూర్‌లోని హైటెక్‌ సిటీ జంక్షన్‌లో ఉన్న ట్రాఫిక్‌ బూత్‌లో ఈ సంఘటన జరిగింది. రోడ్డుపై ఎంతో మంది వెళ్తున్నారు.. వస్తున్నారు. ఎవరితో మనకేంటి అన్నట్లుగా పోకిరీలు ఏమీ పట్టించుకోకుండా మద్యం సేవిస్తున్నారు. మాములుగా ఈ బూత్‌లలోనే నిలబడి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తారు. సిగ్నల్స్‌ను కట్రోల్‌ చేస్తారు. ఎండా, వాన నుంచి ట్రాఫిక్‌ పోలీసులకు ఈ బూత్‌లు రక్షణగా ఉంటాయి. మద్యం బాబులు ఆ ట్రాఫిక్‌ బూత్‌నే బార్‌గా ఉపయోగించడం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు.

వారికి అది పోలీసులు ఉపయోగించే బూత్‌ అని తెలిసి ఉండదని కొందరు చెబుతున్నారు. ఇంకొందరైతే ఇలా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని వదిలిపెట్టొద్దంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా.. మాదాపూర్‌ జంక్షన్‌లో సీసీ కెమెరాలు ఎక్కువగానే ఉంటాయి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానం చేసే ఉంటాయి. అయినా కూడా వీరిని గుర్తించకపోవడంతో విమర్శలు చేస్తున్నారు. అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు మద్యం బాబుల వ్యవహారాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. ఆ వీడియోనే వాట్సాప్‌ గ్రూపుల్లో తెగ వైరల్‌ అవుతోంది.

Next Story