Video: పెద్దపులితో వ్యక్తి రీల్, ఒక్కసారిగా దాడి..ఆ తర్వాత ఏం జరిగిందంటే?
యువకుడు పెద్దపులితో రీల్స్ చేస్తూ దాడికి గురయ్యాడు.
By Knakam Karthik
Video: పెద్దపులితో వ్యక్తి రీల్, ఒక్కసారిగా దాడి..ఆ తర్వాత ఏం జరిగిందంటే?
రేయ్ పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూస్కో.. పులితో ఫొటోతో దిగాలి అనిపించిందో అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు.. ట్రై చేయొచ్చు.. కానీ సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం.. వేటాడేస్తది.. ఇది సినిమాలో డైలాగే అయినా.. కింద వీడియోకి మాత్రం పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోపై ఇప్పుడు జరుగుతోన్న చర్చ ఇదే. ఓ యువకుడు పెద్దపులితో రీల్స్ చేస్తూ దాడికి గురయ్యాడు. ఈ ఘటన థాయిలాండ్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
వైరల్ గా మారిన వీడియోలో ఓ యువకుడు పులిని చైన్ తో పట్టుకుని నడుస్తూ వస్తుంటాడు. కొంత దూరం వచ్చాక ఆగి దాని పక్కన కూర్చుంటాడు. ఇంత వరకు ఏ ఇబ్బంది లేదు. కానీ జూపార్క్ సిబ్బందిలోని మరో వ్యక్తి ఆ పులిని కర్రతో కొడుతాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పులి యువకుడిపై దాడికి దిగింది. ఆ యువకుడు ప్రాణ భయంతో కేకలు వేశాడు. ఇదంతా అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. చివరికి ఆ యువకుడు గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది.