కదులుతున్న ట్రక్‌లో దోపిడీ.. సినీ ఫక్కీలో ఘటన.. వైరల్ వీడియో

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

By Srikanth Gundamalla  Published on  25 May 2024 2:15 PM IST
theft,  highway,  truck, viral video,

కదులుతున్న ట్రక్‌లో దోపిడీ.. సినీ ఫక్కీలో ఘటన.. వైరల్ వీడియో

సినిమాల్లో కొన్ని చోరీల సంఘటలను చిత్రీకరిస్తుంటారు. కదులుతున్న ట్రైన్‌.. ఇతర ట్రక్కుల నుంచి వస్తువులను దొంగిలిస్తుంటారు. ఇదంతా నిజం కాకపోయినా సినిమా చూస్తున్న సమయంలో థ్రిల్‌గా అనిపిస్తుంది. ఒక బయట నిజమైన దొంగలు కూడా ట్రైన్లు, బస్సుల్లో కిటికీల వద్ద కూర్చున్నప్పుడు చేతుల్లో ఉన్న సెల్‌ఫోన్లు.. పర్స్‌లను చూసి లాక్కుని పారిపోతుంటారు. కానీ.. కదులుతున్న భారీ వాహనాల నుంచి చోరీ చేయడం రిస్క్‌ పని. కానీ.. తాజాగా బైక్‌పై వచచిన ముగ్గురు వ్యక్తులు ట్రక్కులో నుంచి సామాన్లను ఎత్తుకుని పోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వీళ్లెక్కడ ట్రైనింగ్ తీసుకున్నారా బాబూ.. ఇలాంటి స్టంట్స్‌ చేస్తున్నారేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ట్రక్కు వెళ్తుంది. బైక్‌పై ముగ్గురు వ్యక్తులు ట్రక్కును ఫాలో అయ్యారు. ఇక వెనకాలే కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ట్రక్కులో ఉన్న సామానుకి కట్టిన తాళ్లు పట్టుకుని వెళాడుతూ పైకి ఎక్కారు. ఆ తర్వాత ట్రక్కు లోడ్‌లో ఉన్న ఓ మూటను కిందకు విసిరేశారు. బైక్‌ నడుపుతున్న వ్యక్తి ట్రక్కుకు దగ్గరగా వెళ్లడంతో.. ఆ ఇద్దరు వ్యక్తులు మళ్లీ తాళ్లను పట్టుకుని మెల్లిగా కిందకు జారారు. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ట్రక్కు.. బైకు రన్నింగ్‌లో ఉన్నప్పుడే బైక్‌ మీదకు ఎక్కేశారు. ఇక ఇదంతా వెనకాలే కారులో వస్తున్న కొందరు వ్యక్తులు ఫోన్లో రికార్డు చేశారు. రన్నింగ్‌లో ఉన్న ట్రక్కు నుంచి బైక్‌పైకి దిగుతున్న వీడియో అందరినీ గగుర్పాటుకి గురి చేసింది. మొత్తం మీద సినిమా చూపించారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ధూమ్‌ సీన్ గుర్తుకు వస్తోందని అంటున్నారు. కొందరు మాత్రం ఇలా చోరీలకు పాల్పడుతున్న వారి పట్ల భయం వ్యక్తం చేస్తున్నారు. బైక్‌కి నెంబర్‌ ప్లేట్‌ కూడా లేదని వీడియోను చూస్తే అర్థం అవుతుంది. పోలీసులు ఈ వీడియోపై స్పందించి నిందితులను పట్టుకోవాలని కోరుతున్నారు.


Next Story