కొంప‌ముంచిన డ్యాన్స్‌.. వ‌ధువు చెంప ప‌గుల‌కొట్టిన వ‌రుడు.. మారిపోయిన పెళ్లికొడుకు

Tamil Nadu groom slaps bride for dancing at wedding function.ఇటీవ‌ల కాలంలో యువ‌త త‌మ వివాహాల‌ను వైవిధ్యంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Jan 2022 2:55 PM IST
కొంప‌ముంచిన డ్యాన్స్‌.. వ‌ధువు చెంప ప‌గుల‌కొట్టిన వ‌రుడు.. మారిపోయిన పెళ్లికొడుకు

ఇటీవ‌ల కాలంలో యువ‌త త‌మ వివాహాల‌ను వైవిధ్యంగా జ‌రుపుకోవాల‌ని బావిస్తున్నారు. పెళ్లి మండ‌పంలోకి వ‌చ్చేట‌ప్పుడు డ్యాన్సులు చేయ‌డం వంటివి వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఓ వ‌ధువు కూడా డ్యాన్స్ చేయ‌గా..కోపంతో ఊగిపోయిన వ‌రుడు.. వ‌ధువు చెంప‌పై కొట్టాడు. అంతే చిర్రెత్తుకు వ‌చ్చిన వ‌ధువు ఆ వ‌రుడిపై చేయి చేసుకుంది. అది కాస్తా.. వివాదానికి దారి తీసి వివాహాం ఆగిపోయింది. అంతేనా.. పెళ్లి కుమారై తండ్రి అదే ముహూర్తానికి బంధువుల అబ్బాయితో ఆమెకు వివాహం జ‌రిపించాడు. ఈ ఘ‌టన త‌మిళ‌నాడు రాష్ట్రంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. కడలూరు జిల్లా పన్రిటీకి చెందిన ఓ వ్యాపారవేత్త కుమారైకు పెరియ‌క‌ట్టుపాళ‌యానికి చెందిన ఓ యువ‌కుడితో గ‌తేడాది న‌వంబ‌ర్ 6న నిశ్చాతార్థం జ‌రిగింది. వీరి పెళ్లి జ‌న‌వ‌రి 20న కడంపుల్యూర్ గ్రామంలో జ‌ర‌గాల్సి ఉంది. జ‌న‌వరి 19న వ‌ధూవ‌రుల బృందం మండ‌పానికి చేరుకుంది. ఆ స‌మ‌యంలో పెళ్లికుమారై బంధువుల‌తో క‌లిసి డ్యాన్స్ చేసుకుంటూ వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చింది. అది వ‌రుడికి న‌చ్చ‌లేదు. వ‌ధువును ప్ర‌శ్నించ‌గా.. మాటా మాటా పెర‌గ‌డంతో కోపంతో వ‌రుడు.. వ‌ధువు చెంప చెళ్లుమ‌నిపించాడు. వ‌ధువు కూడా తాను త‌క్కువేమీ కాద‌ని అత‌డి చెంప ప‌గ‌లకొట్టింది. గొడ‌వ పెద్దది కావ‌డంతో.. వివాహాన్ని ర‌ద్దు చేసుకున్నారు. కాగా.. అదే ముహూర్తానికి పెళ్లికి వ‌చ్చిన బంధువుల్లోని ఓ యువ‌కుడితో ఆ యువ‌తికి వివాహాన్ని జ‌రిపించారు.

ఈ ఘ‌ట‌న‌పై వ‌రుడు స్పందించాడు. డ్యాన్స్ ఎందుకు చేశావ‌ని ప్ర‌శ్నించినందుకు వ‌ధువు త‌ల్లిదండ్రుల‌తో పాటు బంధువులు త‌న‌ను దూషించి పెళ్లిర‌ద్దు చేసుకున్నార‌న్నారు. పెళ్లి కోసం త‌మ కుటుంబం రూ.7లక్ష‌లు ఖ‌ర్చు చేసింద‌ని.. దాన్ని ఇప్పించాల‌ని పన్రుటి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Next Story