బాలికలకు లైంగిక వేధింపులు.. టీచర్‌ను చెప్పులతో కొట్టిన మహిళలు.. వీడియో వైరల్

School Teacher Thrashed by Women for Molesting Girls.. Video viral. పాఠశాలలో బాలికలపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని మహిళలు దారుణంగా

By అంజి
Published on : 21 Oct 2022 11:03 AM IST

బాలికలకు లైంగిక వేధింపులు.. టీచర్‌ను చెప్పులతో కొట్టిన మహిళలు.. వీడియో వైరల్

పాఠశాలలో బాలికలపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని మహిళలు దారుణంగా కొట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో.. మహిళలు టీచర్‌ను బూట్లు, చెప్పులతో కొట్టడం చూడవచ్చు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. అజంగఢ్‌లోని ఫుల్‌పూర్ పోలీసు పరిధిలోని సరాయ్ ఖుర్ద్ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో ఉపాధ్యాయుడి నుంచి తమకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో బాలికల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని చెప్పులతో కొట్టారు. తరగతిలో బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని, తమను అనుచితంగా తాకాడని బాలికలు ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పూల్పూర్ పోలీసులు పాఠశాలకు చేరుకుని నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Next Story