చీర కట్టుకుని నదిలో డైవ్‌ చేసిన బామ్మలు.. వీడియో వైరల్‌

Saree-clad Women Effortlessly Dive Into Tamil Nadu's Thamirabarani River. తమిళనాడుకు చెందిన వృద్ధ మహిళలు చీర కట్టుకుని నదిలో డైవింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు

By అంజి  Published on  8 Feb 2023 9:36 AM IST
చీర కట్టుకుని నదిలో డైవ్‌ చేసిన బామ్మలు.. వీడియో వైరల్‌

తమిళనాడుకు చెందిన వృద్ధ మహిళలు చీర కట్టుకుని నదిలో డైవింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రాష్ట్ర అటవీశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ సుప్రియా సాహు షేర్ చేసిన వైరల్ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. 20 సెకన్ల క్లిప్‌లో.. చీర కట్టుకున్న వృద్ధ మహిళల బృందం ఉత్సాహంగా తామిరబరణి నదిలోకి దూకడం చూడవచ్చు. ఎలాంటి భయం లేకుండా లోతైన నీటిలోకి అప్రయత్నంగా డైవింగ్ చేస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సుప్రియా సాహు ట్వీట్‌ చేస్తూ క్యాప్షన్‌ ఇలా రాశారు. "తమిళనాడులోని కల్లిడైకురిచి వద్ద తామిరబర్ని నదిలో ఈ చీరలు ధరించిన సీనియర్ మహిళలు అప్రయత్నంగా డైవింగ్ చేయడం చూసి ఆశ్చర్యపోయాను. ఇది సాధారణ వ్యవహారం అయితే కాదు. వీరు డైవింగ్‌లో ప్రవీణులని నాకు చెప్పబడింది. ఖచ్చితంగా ఇది స్ఫూర్తిదాయకమైన వీడియో. ఇది ఓ స్నేహితుడు ఫార్వార్డ్ చేశారు" అని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 123K వ్యూస్ వచ్చాయి. దీనికి 1694 లైక్‌లు, 246 రీట్వీట్లు వచ్చాయి.

వీడియోలో మహిళల అద్భుతమైన డైవింగ్ స్కిల్స్ నెటిజన్లను కట్టిపడేశాయి. ఈ వీడియోపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్‌ "సూపర్ డైవింగ్ బామ్మ" అని రాశారు. మరొక నెటిజన్‌ ఇలా వ్రాశాడు. "ఇది సాధారణంగా గ్రామ బావులలో పురుషులు, మహిళలు, పిల్లలు మొదలైన వారికి రోజువారీ పని, పై నుండి డైవింగ్! వారు దానిలో పూర్తిగా నేర్పరి." కొంతమంది నెటిజన్లు ఈ అభ్యాసం సురక్షితంగా ఉందా లేదా అనే దాని గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఒక నెటిజన్‌ ఇలా అన్నారు. "చీర ఈత కొట్టడానికి ప్రమాదకరం." మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు. "అందంగా ఉంది కానీ నీరు సురక్షితంగా డైవింగ్ చేయడానికి తగినంత లోతుగా లేదు."

Next Story