రష్మిక కాళ్లు మొక్కిన మేకప్‌ అసిస్టెంట్‌, వీడియో వైరల్

హీరోయిన్ రష్మిక మేకప్‌ అసిస్టెంట్‌ పెళ్లిలో సందడి చేశారు. అక్కడ జరిగిన ఓ సంఘటన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  4 Sept 2023 11:31 AM IST
Rashmika, makeup assistant, marriage, Viral video,

రష్మిక కాళ్లు మొక్కిన మేకప్‌ అసిస్టెంట్‌, వీడియో వైరల్

నేషనల్ క్రష్‌గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. ఆమె నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక తన వ్యక్తిగత సిబ్బందికి ప్రాధాన్యత ఇస్తారు. వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరువుతూ ఉంటారు. తాజాగా ఆమె తన మేకప్‌ అసిస్టెంట్‌ పెళ్లిలో సందడి చేశారు. అక్కడ జరిగిన ఓ సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మేకప్‌ అసిస్టెంట్‌ పెళ్లికి హాజరైన రష్మిక.. వారిపై అక్షింతలు వేసి ఆశీర్వదించింది. ఆ తర్వాత మేకప్‌ అసిస్టెంట్‌ ఒక్కసారిగా రష్మిక పాదాలపై పడిపోయాడు. ఆశీర్వదించాలంటూ కోరాడు. దాంతో.. రష్మిక కూడా ఒక్కసారిగా షాక్‌ అయ్యింది. వెంటనే పెళ్లి కూతురు కూడా ఆమె పాదాలకు నమస్కరించింది. వద్దు అంటూ అడ్డుకునే ప్రయత్నం చేసినా.. నవ వధూవరులు రష్మిక కాళ్లపై పడిపోయారు. ఇక చేసేందేం లేక ఇద్దరిని ఆశీర్వదించారు రష్మిక మందన్న. ఆ తర్వాత ఇద్దరితో కలిసి ఒక ఫోటో దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు వీడియోకు లైక్స్‌ కొడుతూ.. షేర్ చేస్తున్నారు.

ఇటీవల రష్మిక మందన్న ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై కూడా మాట్లాడారు. తన మ్యారేజ్‌కు ఇంకా చాలా సమయం పడుతుందని.. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టినట్లు చెప్పారు రష్మిక మందన్న. పుష్ప తర్వాత పాన్‌ ఇండియా స్థాయిలో అభిమానులను సొంతం చేసుకుంది. బాలీవుడ్‌ నుంచి కూడా రష్మికకు ఆఫర్లు వస్తున్నాయి. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా రానున్న 'యానిమల్' సినిమాలో నటిస్తోంది ఈ భామ. ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల అవుతుంది. ఇక పుష్ప-2లోనూ హీరోయిన్‌గా మరోసారి కనిపించనున్నారు రష్మిక మందన్న.

Next Story