వందే భారత్‌ ట్రైన్‌లో కుళ్లిపోయిన ఆహారం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు పాచిపోయిన ఆహారం అందించారు సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

By అంజి  Published on  2 July 2023 12:38 PM IST
Railway staff, rotten food, passengers, Vande Bharat train

వందే భారత్‌ ట్రైన్‌లో కుళ్లిపోయిన ఆహారం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు పాచిపోయిన ఆహారం అందించారు సిబ్బంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. పాడైపోయిన ఆహారాన్ని అందించడం పట్ల ప్రయాణికులు ఆగ్రహ వ్యక్తం చేశారు. రైల్వే సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. కాగా ఒక ప్రయాణీకుడు వందేమాతరం ఎక్స్‌ప్రెస్‌లో అందించిన పాడిపోయిన ఆహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో క్లిప్‌లో ప్రయాణికులు.. రైల్వే సిబ్బందితో గొడవకు దిగిన దృశ్యాలను వీడియో క్లిప్‌లో స్పష్టంగా చూడవచ్చు. వీడియో చూసిన నెటిజన్లు రైల్వే శాఖ పనితీరుపై మండిపడుతున్నారు.

అయితే ఘటన మహారాష్ట్రలో జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి ఫిర్యాదులు ఎన్నో వచ్చాయి. వందే భారత్‌ రైళ్లలో అందిస్తున్న ఫుడ్‌ను తినలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయని, వాటిని తింటే బయటకే తప్ప నోట్లోకి పోవడం లేదని రైలు ప్రయాణికులు అంటున్నారు. ఐఆర్‌సీటీసీ సబ్‌ ఏజెంట్లకు బాధ్యతలు ఇచ్చి.. నాసిరకమైన ఆహారాన్ని తయారు చేయడంలో భాగస్వాములవుతున్నారు. ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేసి, నాసిరకం పదార్థాలు తయారు చేసి అందించడం సరికాదని, రైల్వే శాఖ ఇప్పటికైనా పరిశుభ్రమైనా ఆహారాన్ని అందించాలని నెటిజన్లు కోరుతున్నారు.

Next Story