Video: కారు ఢీ కొట్టాడని.. ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం
భారత మాజీ క్రికెటర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కారును రోడ్డుపై ఓ ఆటో స్వల్పంగా ఢీ కొట్టింది. దీంతో రాహుల్ ద్రవిడ్.. ఆటో డ్రైవర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు.
By అంజి Published on 5 Feb 2025 10:01 AM IST
Video: కారు ఢీ కొట్టాడని.. ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం
భారత మాజీ క్రికెటర్, కోచ్ రాహుల్ ద్రవిడ్ కారును రోడ్డుపై ఓ ఆటో స్వల్పంగా ఢీ కొట్టింది. దీంతో రాహుల్ ద్రవిడ్.. ఆటో డ్రైవర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. క్రికెట్ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే వ్యక్తిగా పేరుగాంచిన ద్రవిడ్.. ఎం. చిన్నస్వామి స్టేడియం సమీపంలోని కన్నింగ్‌హామ్ రోడ్డులో ఒక ఆటోరిక్షా డ్రైవర్‌తో తీవ్రమైన వాగ్వాదానికి దిగాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. ఆటో డ్రైవర్‌తో మాట్లాడుతూ తన నిరాశను బయటపెడుతూ ద్రవిడ్ కోపంగా ఉన్నట్లు చూడవచ్చు.
Rahul Dravid’s Car touches a goods auto on Cunningham Road Bengaluru #RahulDravid #Bangalore pic.twitter.com/AH7eA1nc4g
— Spandan Kaniyar ಸ್ಪಂದನ್ ಕಣಿಯಾರ್ (@kaniyar_spandan) February 4, 2025
అదృష్టవశాత్తూ, ఈ ఢీకొన్న సమయంలో ఎవరికీ గాయాలు కాలేదు. వాహనంపై పెద్దగా నష్టం జరగలేదు. ద్రావిడ్ కోపంగా ఉండటం కనిపించడంతో అభిమానులు, దిగ్గజ క్రికెటర్ నటించిన ఒక ప్రసిద్ధ ప్రకటనను గుర్తు చేసుకున్నారు. అందులో అతను 'కోపంగా ఉన్న యువకుడిగా' తనను తాను 'ఇందిరానగర్ కా గుండా (ఇందిరానగర్ గ్యాంగ్‌స్టర్)'గా పిలుచుకుంటూ హాస్యాస్పదంగా చూపించారు. 2021లో విడుదలైన ప్రకటనలో, ద్రవిడ్ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుంటూ రోడ్డుపై ఉన్న ప్రజలతో తీవ్ర వాగ్వాదానికి దిగుతున్నట్లు కనిపించింది.
అతని ఇటీవలి వీడియో వైరల్ అయిన వెంటనే, అభిమానులు సోషల్ మీడియాను 'ఇందిరానగర్ కా గుండా' మీమ్స్‌తో నింపారు. ఈ సంఘటనకు హాస్యాస్పదమైన టేక్ ఇచ్చారు. 2024 T20 ప్రపంచ కప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ తన పదవీకాలాన్ని ముగించాడు. రోహిత్ శర్మ, ద్రవిడ్ నాయకత్వంలో.. టీమిండియా ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకోవడం ద్వారా 11 సంవత్సరాల ICC ట్రోఫీ కలను సాధించింది.