పుణెలో వరద నీటిలో యువకుడు సర్ఫింగ్.. వైరల్ వీడియో

క్రేజీగా ప్రవర్తించిన ఓ యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  8 Jun 2024 9:13 AM GMT
pune, man surfing, rain water, viral video,

పుణెలో వరద నీటిలో యువకుడు సర్ఫింగ్.. వైరల్ వీడియో 

యువత సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. రకరకాల వీడియోస్ చేస్తూ జనాల్లో గుర్తింపు కోసం తాపత్రయ పడుతున్నారు. లైక్స్ కోసం ఇంకొందరు పిచ్చిపిచ్చిగా రీల్స్ చేస్తున్నారు. తాజాగా.. ఇంకాస్త క్రేజీగా ప్రవర్తించిన ఓ యువకుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సంఘటన పుణెలోని ఎరవాడ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అప్పుడే వర్షం పడటంతో రోడ్డుపైకి భారీ వరద వచ్చింది. దాంతో.. ఓ యువకుడు తెల్లటి చాపను తెచ్చుకుని రోడ్డుపై పరిచి సర్ఫింగ్ చేశాడు. ప్రవాహంతో పాటే అతను పడుకున్నచాప కూడా ముందుకు కదలింది. ఇక అతను కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేశాడు. ఎదురుగా వాహనాలు వస్తుంటే.. తప్పుకోండి అంటూ ముందుకు సర్ఫింగ్ చేశాడు. అతనలా వరద నీటిలో సర్ఫింగ్ చేస్తుంటే.. అక్కడే ఉన్న అతని స్నేహితులు వీడియో తీశారు. ఆ తర్వాత దాన్ని అప్‌లోడ్‌ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు వెళ్తున్న రోడ్డుపై యువకుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. అతని వల్ల ఇతర వాహనదారులు ఇబ్బందులు పడ్డారనీ కామెంట్స్ చేస్తున్నారు. అదే రూట్‌లో బస్సు, లారీ వంటి వాహనాలు వస్తే అతని తిక్క కుదిరేదంటున్నారు.

Next Story