టికెట్‌ లేకుండా వందేభారత్‌ ఎక్కిన పోలీసు..TTEకి చిక్కి చివరకు..

ఓ పోలీసు అధికారి టికెట్‌ లేకుండా వందేభారత్‌ ట్రైన్ ఎక్కాడు. ఆ తర్వాత టీటీఈకి చిక్కి చుక్కలు చూశాడు.

By Srikanth Gundamalla  Published on  12 Oct 2023 1:21 PM IST
police officer,  vande bharat express, without ticket, viral video,

టికెట్‌ లేకుండా వందేభారత్‌ ఎక్కిన పోలీసు..TTEకి చిక్కి చివరకు..

వందేభారత్‌ రైళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వేగంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఈ సర్వీసులను కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే.. దేశవ్యాప్తంగా పలుమార్గాల్లో వందేభారత్‌ సర్వీసులు విజయవంతంగా పరుగెడుతున్నాయి. అయితే.. ఇందులో విమానంలో ఉండేలా మంచి సదుపాయాలు కల్పించింది ప్రభుత్వం. దీంట్లో ప్రయాణించాలంటే కాస్త ఖర్చు ఎక్కువే అని చెప్పాలి. ఏదీ ఏమైనా సుఖమైన ప్రయాణానికి ధరెక్కువే ఉంటుందని పలువురు చెబుతున్నారు. ఇక ఈ ట్రైన్లలో అప్పడప్పుడు కొందరు టికెట్‌ కొనకుండా ఎక్కడి అడ్డంగా బుక్‌ అవుతున్నారు. తాజాగా ఓ పోలీసు అధికారి కూడా అదే పని చేశాడు. ఆ తర్వాత టీటీఈకి చిక్కి చుక్కలు చూశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగింది. రాష్ట్ర పోలీస్‌ శాఖకు చెందిన ఒక ఇన్‌స్పెక్టర్‌లో టికెట్‌ తీసుకోకుండా వందే భారత్‌ ట్రైన్‌ ఎక్కి సీట్లో దర్జాగా కూర్చొన్నాడు. కాసేపటికే టీటీఈ అక్కడికి వచ్చాడు. టికెట్‌ చూపించాలని అడుగుతాడు. దాంతో.. సదురు ఇన్‌స్పెక్టర్‌ తనదగ్గర టికెట్‌ లేదని సమాధానం చెబుతాడు. తాను వెళ్లాల్సిన రైలును కొన్ని కారణాల వల్ల మిస్‌ అయ్యాయని చెప్తాడు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వందేభారత్ ఎక్కానని.. ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని అన్నాడు ఇన్‌స్పెక్టర్. దాంతో.. టికెట్‌ లేకుండా రైలులో ప్రయాణించేందుకు వీలులేదని టీటీఈ తెగేసి చెప్పాడు. టికెట్‌ లేకుండా వందేభారత్‌ ఎక్కకూడదని.. ట్రైన్‌ మిస్‌ అయితే బస్సులో వెళ్లాల్సింది అని చెప్పాడు. ఏది ఏమైనా వందేభారత్‌లో టికెట్‌ లేకుండా ప్రయాణం చేసేందుకు అనుమతి ఇవ్వనంటూ టీటీఈ సదురు పోలీస్‌ అధికారికి చివాట్లు పెట్టాడు.

ఆ తర్వాత తదుపరి స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ను టీటీఈ దించేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై నెటిజన్లు టీటీఈని అభినందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఎవరైనా సరే టికెట్‌ తీసుకుని ప్రయాణించాలని గట్టిగా చెప్పారని అంటున్నారు. రూల్స్‌ అందరికీ ఒకేలా ఉండాలని.. టీటీఈ తన బాధ్యత నిర్వర్తించారంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.

Next Story