బీరు కోసం కన్న బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు
మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 30 Sep 2024 9:17 AM GMTబీరు కోసం కన్న బిడ్డను అమ్మేసిన తల్లిదండ్రులు
మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి. చిన్న విషయాలకే గొడవపడి విడిపోవడం.. ఆస్తుల కోసం రక్త సంబంధీకులను దూరం చేసుకోవడం చేస్తున్నారు. తాజాగా ఒక జంట కేవలం బీరు, వెయ్యి డాలర్ల కోసం కన్నబిడ్డను విక్రయించేందుకు ప్రయత్నించారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
అమెరికాలోని నార్త్‌వెస్ట్ అర్కాన్సస్‌కు చెందిన డేరియన్ అర్బన్, షలేన్ ఇద్దరూ దంపతులు. వీరికి మూడు నెలల బాబు ఉన్నాడు. బీరు, వెయ్యి డాలర్లు.. అంటే మన కరెన్సీలో 83వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు సమాచారం అందుకున్నారు. దాంతో.. దంపతులను ట్రేస్ చేశారు. వారి వద్ద వెయ్యి డాలర్లకు బిడ్డను విక్రయించడానికి అంగీకరించిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. బీరు కూడా విక్రయంలో భాగంగా ఉందని పోలీసులు చెప్పారు. చివరకు దంపతులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదురు జంటను నెటిజన్లు తీవ్రంగా తిట్టిపోస్తున్నారు.