పాన్ కార్డుకు సంబంధించిన సమాచారం, అప్‌డేట్‌లను తమిళంలోనూ అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి తమిళ సినీ నటుడు విజయ్ సేతుపతి విజ్ఞప్తి చేశారు. ఆర్థిక లావాదేవీల్లో ఎంతో కీలకమైన పాన్ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని అభ్యర్థించారు. ఓ ఈవెంట్‌లో విజయ్ సేతుపతి మాట్లాడారు. పాన్ కార్డు వివరాలు ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. దీని వల్ల ఈ భాషలు రాని వారు పాన్ కార్డు అప్‌డేట్‌ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తమిళ భాషను యాడ్ చేయడం కష్టమైనప్పటికీ ప్రయత్నించాలని కోరారు. పాన్ కార్డు వెబ్‌సైట్‌లో తమిళంలో సమాచారం అందుబాటులో ఉంటే అది మరింత ఎక్కువమందికి చేరుతుందన్నారు. పాన్ కార్డుపై విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.