‘రిమ్‌జిమ్‌ గిరే సావన్‌’ పాటకు వృద్ధ జంట స్టెప్స్..ఆనంద్‌ మహీంద్ర ట్వీట్

ఓ వృద్ధ జంట ‘రిమ్‌జిమ్‌ గిరే సావన్‌’ పాటకు స్టెప్పులేస్తూ వర్షంలో తిరిగారు.

By Srikanth Gundamalla  Published on  3 July 2023 3:30 PM IST
Old, Bollywood, Song Remake, Anand Mahindra, Tweet,

‘రిమ్‌జిమ్‌ గిరే సావన్‌’ పాటకు వృద్ధ జంట స్టెప్స్..ఆనంద్‌ మహీంద్ర ట్వీట్

ప్రముఖ బిజినెస్‌ మ్యాన్‌ ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. తనకు ఎవరైనా టాలెంట్‌గా కనిపిస్తే చాలు వెంటనే వీడియో, ఫొటోలు ట్విట్టర్‌లో పోస్టు చేసి పంచుకుంటారు. అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోలను కూడా పోస్టు చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్‌ మహీంద్ర ఓ వీడియో ట్వీట్‌ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

1979లో అమితాబ్‌ బచ్చన్, మౌషుమి చటర్జి నటించిన బాలీవుడ్‌ సినిమా 'మంజిల్‌ '. ఇందులోని ‘రిమ్‌జిమ్‌ గిరే సావన్‌’ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ సాంగ్‌లో ఇద్దరూ కలిసి వర్షంలో ముంబై అంతా తిరుగుతూ కనిపిస్తారు. సరిగ్గాలే ఇలానే ఓ వృద్ధ జంట కూడా పాటలో ఉన్నట్లే దుస్తులు ధరించి అవే లొకేషన్లలో ఒకరి చేతిని ఒకరు పట్టుకుని వానలో తిరుగుతూ కనిపించారు. ఆ వీడియో ఆనంద్‌ మహీంద్రకు ఎంతో నచ్చింది. దాంతో.. వెంటనే ఆయన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

వీడియోలో కనిపిస్తున్న వృద్ధ జంట హిట్‌ పాటను గుర్తు చేశారని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు. సినిమాలోని అవే లొకేషన్లలో తిరగడం ఎంతో బాగా అనిపించిందని చెప్పారు. వారిని అభినందిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్ర. ఆలోచనలను బయటపెడితే.. జీవితాన్ని అందంగా మలుచుకోవచ్చని వృద్ధ జంట నిరూపించిందన్నారు ఆనంద్‌ మహీంద్ర.

ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే మిలియన్‌ పైగా మంది వీక్షించారు. నెటిజన్లు వీడియో చూసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ఆ పాటంటే తమకెంతో ఇష్టమని.. వృద్ధులు చేసిన వీడియో తమని కదిలిస్తోందని రాసుకొచ్చారు. పాటను రీమేక్‌ చేసినందుకు వృద్ధ జంటకు కొందరు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story