లంచం తీసుకుంటూ బుక్కై.. నోట్లను నమిలేసిన అధికారి..!

లంచం తీసుకుంటూ ఓ అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. లోకాయుక్త అధికారులను చూసి కరెన్సీని నమిలి మింగేశాడు.

By Srikanth Gundamalla  Published on  25 July 2023 5:24 AM GMT
officer chewed notes, taking bribe, madhyapradesh,

లంచం తీసుకుంటూ బుక్కై.. నోట్లను నమిలేసిన అధికారి..!

లంచం తీసుకుంటూ ఓ అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. ఆ తర్వాత లోకాయుక్త అధికారులను చూసి ఏం చేయాలో అర్థం కాక చేతిలో ఉన్న కరెన్సీని నోట్లో కుక్కి.. నమిలి మింగేశాడు. అతడి తీరు చూసిన అధికారులంతా షాక్‌ అయ్యారు.

ప్రభుత్వ అధికారులు చాలా వరకూ లంచం తీసుకోనిదే పనిచేయడం లేదు. లంచం తీసుకోవడం నేరం అని తెలిసినా.. కొన్ని చోట్ల అడ్డంగా బుక్కవుతూ ఉద్యోగాలు కోల్పోతున్నా డబ్బుల మీద ఆశతో అవినీతికి పాల్పడుతూనే ఉన్నాయి. రెవెన్యూ శాఖలో అయితే ఏ చిన్న పని కోసం వెళ్లినా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌లో రెవెన్యూ శాఖకు చెందిన ఓ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. లోకాయుక్త అధికారులను చూసిన కంగారులో కరెన్సీ నోట్లను నోట్లో పెట్టుకుని నమిలేశాడు.

మధ్యప్రదేశ్‌లోని కట్నీ నగరంలో రెవెన్యూ విభాగంలో గజేంద్ర సింగ్‌ అనే వ్యక్తి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ పని కోసం గజేంద్ర సింగ్‌ వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. ఆ పని చేసి పెట్టేందుకు గజేంద్ర సింగ్ర రూ.5వేలు లంచం డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే పని జరగదని తేల్చి చెప్పాడు. దాంతో.. సదురు వ్యక్తి లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ క్రమంలోనే గజేంద్ర సింగ్‌ సదురు వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అయితే.. లోకా యుక్త అధికారుల ఎంట్రీని ఊహించిన గజేంద్ర సింగ్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యాడు. జాబ్‌ పోతుందేమో అన్న భయం, పరువు పోతుందేమో అన్న ఆందోళనలో ఎవరూ ఊహించని పని చేశాడు. చేతిలో ఉన్న కరెన్సీని నోట్లో పెట్టెసుకున్నారు. కరకర నమిలి మింగేశాడు. ఇదంతా లోకాయుక్త అధికారులు చూస్తుండగానే జరిగిపోయింది. గజేంద్ర సింగ్‌ చర్యతో అధికారులంతా షాక్‌ అయ్యారు.

ఆ తర్వాత వెంటనే స్పందించిన రెవెన్యూర, లోకాయుక్త అధికారులు గజేంద్ర సింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. అతనికి ఏ ప్రమాదం జరగలేదని వైద్యులు తేల్చి చెప్పారు. దాంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక నెటిజన్లు గజేంద్ర సింగ్ వ్యవహారంపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. లంచం తీసుకోకుండా పని చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా అంటూ హితవు పలుకుతున్నారు. ఇంకొందరైతే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు .

Next Story