గుజరాత్‌లో కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ స్థానికులు

Notes worth lakhs showered at Gujarat sarpanch nephew wedding. భారతీయ వివాహాలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. విందులు, దుస్తులు,

By అంజి  Published on  19 Feb 2023 10:19 AM IST
గుజరాత్‌లో కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ స్థానికులు

భారతీయ వివాహాలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. విందులు, దుస్తులు, ఆభరణాలు, వేదికలపై భారీగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. పెళ్లి వేడుక కోసం ముందస్తుగానే డబ్బులను పొదుపు చేసుకుంటుంటారు. ఇటీవల కాలంలో అలాంటి విలాసవంతమైన వివాహాల వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది. గుజరాత్‌లోని ఓ యువకుడి పెళ్లి వేడుకలో కరెన్సీ నోట్ల వర్షం కురిపించింది. తమ కుమారుడి పెళ్లి వేడుక సందర్భంగా కుటుంబం టెర్రస్‌పై నుంచి గాల్లోకి కరెన్సీ నోట్లను విసిరేసింది. దీంతో ఆ నోట్లను పట్టుకునేందుకు అతిథులు, బాటసారులు ఒకరినొకరు తోసుకున్నారు.

డబ్బుల వర్షం కురిపించిన వీడియో గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ ఘటన మెహసానా జిల్లాలోని కడి తాలూకాలో చోటుచేసుకుంది. ఎగిరే నోట్లను పట్టుకునేందుకు గ్రౌండ్‌లో ఉన్నవారు ఒకరినొకరు తోసుకోవడంతో టెర్రస్ నుండి డబ్బు వర్షం కురుస్తున్నట్లు వీడియోలో చూపబడింది. టెర్రస్ నుండి చిత్రీకరించిన మరొక వీడియోలో.. నగదు వర్షం కురిపిస్తున్న వ్యక్తి.. ప్రజలపైకి రూ. 500 నోట్లను కిందకు విసిరేయడం కనిపిస్తుంది.

మాజీ సర్పంచ్ కరీంభాయ్ దాదుభాయ్ జాదవ్ మేనల్లుడు రజాక్ వివాహం సందర్భంగా ఈ సంఘటన జరిగింది. స్పష్టంగా వారి కుటుంబంలో రజాక్ ఏకైక కుమారుడు. దీంతో వారు అతడి పెళ్లిని భిన్నంగా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇలా చేశారని స్థానికుల నుంచి సమాచారం.


Next Story