కాళీమాతకు నైవేద్యంగా నూడుల్స్‌.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

సాధారణంగా అమ్మవారి ఆలయమైనా, స్వామివారి ఆలయం అయినా.. లడ్డూ, పులిహోర, కేసరి, పరమాన్నం వంటి పదార్థాలను నైవేద్యంగా పెట్టి, వితరణ చేస్తారు.

By అంజి  Published on  8 Dec 2024 6:21 AM GMT
Noodles, Kali Mata, temple, West Bengal

కాళీమాతకు నైవేద్యంగా నూడుల్స్‌.. ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా?

సాధారణంగా అమ్మవారి ఆలయమైనా, స్వామివారి ఆలయం అయినా.. లడ్డూ, పులిహోర, కేసరి, పరమాన్నం వంటి పదార్థాలను నైవేద్యంగా పెట్టి, వితరణ చేస్తారు. కానీ మన దేశంలోని ఓ కాళీ మందిరంలో మాత్రం అమ్మవారికి నూడుల్స్‌ని నైవేద్యంగా పెడతారు. ఇదొక్కటే కాదు.. చాప్‌సుయ్‌, ఫ్రైయిడ్‌ వెజిటబుల్స్‌, స్టికీ రైస్‌.. వంటి చైనీస్‌ వంటకాలతోనే అమ్మను ప్రసన్నం చేసుకుంటారట. అయినా.. మన దేవతకు చైనా నైవేద్యాలేంటి? అనుకుంటున్నారు కదు.. దేవికి ప్రాంతీయతని అపాదించడంలో అర్థం లేదు. పైగా ఆ లోకమాత స్వయంగా విశ్వస్వరూపిణి కదా. కాళీమాత ఆరాధాన బెంగాల్‌ వారు విశేషంగా చేస్తుంటారు. కాళీమాతకి కూడా బెంగాల్‌ అంటే మక్కువ అధికమేమో. అమ్మవారు స్వయం వ్యక్తమైన ప్రదేశాలు కూడా ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి.

ఆలయానికి 80 ఏళ్ల చరిత్ర

భక్తులు నూడుల్స్‌ నైవేద్యంగా సమర్పించే కాళీమాత ఆలయం కూడా కోల్‌కతాలనే ఉంది. ఇక్కడి టాంగ్రా అనే ప్రాంతంలో ఉందీ ఈ మందిరం. 'చైనా టౌన్‌'గా పిలిచే ఈ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయాన్ని చైనీస్‌ కాళీ టెంపుల్‌ అంటారు. అంతేకాదు. టిబెటన్‌, తూర్పు ఆసియా సంప్రదాయాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదే దేశ, విదేశీ పర్యాటకుల్ని ఇక్కడికి ఎక్కువ ఆకర్షిస్తుందని స్థానికులు చెబుతారు. నిజానికి ఈ దేవాలయం ఈనాటిది కాదు. సుమారు 80 ఏళ్ల నుంచే ఇక్కడి కాళీమాత భక్తుల పూజలు అందుకుంటోంది. అయితే 20 ఏళ్ల క్రితం వరకు ఓ చెట్టుకింద ఉన్న రెండు గ్రానైట్‌ రాళ్లను కుంకుమతో పూజించే వారు భక్తులు. ఆ తర్వాత బెంగాల్‌, చైనాకు చెందిన కొన్ని కమ్యూనిటీలు కలిసి ఈ చైనీస్‌ కాళీ ఆలయాన్ని నెలకొల్పి, అందులో కాళీ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారట.

Next Story