నీరజ్ చోప్రా, మనూ పెళ్లి వార్తలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన భాకర్ తండ్రి
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించిన యంగ్ షూటర్ మనూ భాకర్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 13 Aug 2024 7:15 AM GMTనీరజ్ చోప్రా, మనూ పెళ్లి వార్తలు వైరల్.. క్లారిటీ ఇచ్చిన భాకర్ తండ్రి
పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించిన భారత యంగ్ షూటర్ మనూ భాకర్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలాగే ఇదే పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్‌తో సరిపెట్టుకున్నాడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో గత ఒలింపిక్స్‌లో గోల్డ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీరిద్దరికీ సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నీరజ్ చోప్రా, మనూ భాకర్ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వ్యాపిస్తున్నాయి.
పారిస్ ఒలిపింక్స్‌లో ఓ ఈవెంట్ జరిగిన వేళ షూటర్ మనూ భాకర్ తల్లి.. నీరజ్ చోప్రాతో మాట్లాడుతూ కనిపించారు. అంతేకాదు.. అంతకుముందు నీరజ్ చోప్రా, మనూ భాకర్ కూడా మాట్లాడుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ సిగ్గుపడుతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించారు. ఇక కొందరు నెటిజన్లు ఇది నిజమేనేమో అనుకున్నారు. ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఏకంగా కొందరు నీరజ్, మనూ పెళ్లి చేసుకుంటారనే వార్తను పుట్టించి మరింత హీట్ పెంచారు. చివరకు ఈ విషయంపై మనూ భాకర్ తండ్రి స్పందించాడు. ఈ పుకార్లకు చెక్ పెట్టేశాడు. మనూ భాకర్‌కు ఇంకా పెళ్లి చేసే వయసే లేదన్నాడు.
మనూ భాకర్ చాలా చిన్న వయసున్న అమ్మాయి అని ఆమె తండ్రి రామ్ కిషన్ చెప్పాడు. దాని గురించి ఇప్పుడు తాము ఆలోచించడమే లేదన్నాడు. భవిష్యత్తు ప్రణాళికలు కూడా లేనట్లు ఆయన స్పష్టం చేశారు. నీరజ్‌ను తన కుమారుడిలా మనూ తల్లి చూస్తున్నట్లు రామ్ కిషణ్ చెప్పాడు. నీరజ్ బంధువు కూడా ఈ అంశంపై స్పందించారు. నీరజ్ మెడల్ తెస్తే దేశం మొత్తం అతనిపై ఆసక్తిని ప్రదర్శించిందని, అలాగే అతని పెళ్లి గురించి కూడా ప్రతి ఒక్కరూ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారని నీరజ్ బంధువులు ఒకరు వెల్లడించారు.