కన్న బిడ్డలు చూస్తుండగానే సముద్రంలో గల్లంతైన తల్లి

ముంబైలో విషాదం చోటుచేసుకుంది. పిల్లలు చూస్తుండగానే సముద్రంలో తల్లి గల్లంతైంది.

By Srikanth Gundamalla  Published on  16 July 2023 10:36 AM IST
Mumbai, beach, Woman Dead, Viral Video,

కన్న బిడ్డలు చూస్తుండగానే సముద్రంలో గల్లంతైన తల్లి

టూర్‌లకు ఎటైనా వెళ్తే.. అందమైన ప్రదేశాలను చూస్తే చాలు ఫోన్లో బందిస్తాం. ఆ జ్ఞాపకాలను మళ్లీ ఎప్పుడు చూసిన ఆ ఫీల్‌ ఒచ్చేలా మనతోనే ఉంటాయి. ఫోన్‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో.. నష్టాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి. సెల్ఫీలంటూ దిగబోయి చాలా మంది ప్రమాదాలను ఎదుర్కొన్నారు. కొన్ని సంఘటనల్లో అయితే ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు. ముంబైలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. సముద్ర తీరంలో ఓ జంట ఫొటోలు తీసుకునేందుకు ఫోజులిస్తోంది. అంతలో వచ్చిన భారీ అలలు వారిని అమాంతం మింగేశాయి. ఇదంతా వారి పిల్లలు వీడియో తీస్తుండగా జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ముంబైలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. బిడ్డలతో పాటు ఓ జంట సముద్రం చూసేందుకు వెళ్లింది. పిక్నిక్‌ కోసం వెళ్లిన జంట సముద్రం ఒడ్డున కూర్చొని ఫొటోలు దిగుతున్నారు. తల్లిదండ్రులను వారి పిల్లలే ఫొటోలు, వీడియో తీస్తున్నారు. అప్పుడే అనూహ్యపరిణామం జరిగింది. అలలు భారీగా వస్తున్నాయి. ఉన్నట్లుండి భారీ అల రావడంతో ఇద్దరూ నీళ్లలో పడిపోయారు. అలల్లోనే మహిళ సముద్రంలో కొట్టుకుపోయింది. దాంతో పిల్లలు అమ్మ అమ్మా అని అరవడం మొదలుపెట్టారు. ఆ వీడియోలో పిల్లలు అరుస్తుండటం అందరినీ కదిలించింది.

వాస్తవానికి సుదురు కుటుంబం మొదట జుహూ చౌపట్టీకి వెళ్దామని అనుకున్నారట. కానీ సముద్రం పోటు మీద ఉండటంతో అధికారులు బీచ్‌లోకి అనుమతి ఇవ్వలేదు. దాంతో.. ఆ కుటుంబం బాంద్రాకు వెళ్లింది ఆ సమయంలో తీరంలో ఫొటోలు తీసుకుంటుండగా.. పిల్లలు చూస్తుండగానే తల్లి గల్లంతు అయ్యింది. కాగా.. గల్లంతైన మహిళ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు జ్యోతి సోనార్‌గా గుర్తించారు పోలీసులు.

Next Story