యువ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చిన ఎం.ఎస్ ధోనీ (వీడియో)

తాజాగా మాహీ ఓ యంగ్‌ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  15 Sep 2023 9:15 AM GMT
MS dhoni, Viral Video, Bike lift, Young cricketer,

యువ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చిన ఎం.ఎస్ ధోనీ (వీడియో)

టీమిండియా మాజీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోనీ కెప్టెన్సీకి.. ఆయన ఆట తీరుకి వీరాభిమానులు ఉన్నారు. ఇప్పటికీ కొందరు ఆయన ఆలోచనలే అమలు చేస్తుంటారు. అయితే.. ఎంఎస్‌ ధోనీకి బైకులు, కార్లు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు బైక్‌లపై షికారు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో గతంలో వైరల్ అయ్యాయి. తాజాగా మాహీ ఓ యంగ్‌ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఎంఎస్‌ ధోనీ రాంచీలో ఓ యువ క్రికెటర్‌కు తన బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చాడు. గ్రౌండ్‌లో ఉన్న ధోనీ క్రికెట్‌ ప్రాక్టీస్‌ సెషన్ పూర్తైన తర్వాత తన యమహా బైక్‌ ఆర్‌డీ350పై యువ క్రికెటర్‌ను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత బుల్లెట్‌లా హైవేపై దూసుకెళ్లాడు. వెనకాలే ఎక్కిన కుర్రాడు ధోనీ బైక్‌ ఎక్కడంతో ఎంతో సంతోష పడిపోయాడు. అది అందరికీ తెలియాలన్న భావనతో.. వెంటనే ఫోన్లో రికార్డు చేశాడు. మాహీ బైక్‌ నడుపుతుండగా వెనకాల కూర్చొని సెల్ఫీ వీడియో తీశాడు. రాంచీ రోడ్లపై ఎంఎస్‌ ధోనీ కుర్రాడిని ఎక్కించుకుని దూసుకెళ్తున్న వీడియో నెట్టింట ప్రత్యక్షం అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు వీడియోకు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు.

మిస్టర్‌ కూల్‌ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆ లీగ్ తప్ప మిగతా ఏడాదంతా ధోనీ క్రికెట్‌కు దూరంగానే ఉంటున్నాడు. ఆయన ఎక్కడ కనిపించినా అభిమానులు ఇష్టంగా ఫొటోలు.. వీడియోలు తీసుకుంటున్నారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా కూడా ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

Next Story