పైకప్పు కూలిన ఘటనలో పసివాడ్ని క్షణాల్లో కాపాడిన తల్లి (వీడియో)

ఇంటి పైకప్పు కూలిన ఘటనలో పిల్లాడ్ని రెప్పపాటులో కాపాడుతుంది తల్లి.

By Srikanth Gundamalla  Published on  20 July 2023 6:48 AM GMT
Mother, Saves Boy, Cambodia, Viral Video,

పైకప్పు కూలిన ఘటనలో పసివాడ్ని క్షణాల్లో కాపాడిన తల్లి (వీడియో)

సోషల్‌ మీడియాలో రోజుకో సంఘటన వైరల్ అవుతుంటాయి. ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్‌, సాహసాలకు సంబంధించిన వీడియోలను చూశాం. అయితే.. కంబోడియాలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంట్లో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు.. ఉన్నట్లుండి పైకప్పు కూలుతుంది. ఆ సంఘటన నుంచి పసిపిల్లాడిని తల్లి రెప్పపాటులో కాపాడుతుంది. నెటిజన్లు ఈ వీడియోను చూసి షాక్‌ అవుతున్నారు. రెప్పపాటులో పిల్లాడి ప్రాణాలను కాపాడిందంటూ ఆమెను మెచ్చుకుంటున్నారు.

వీడియో ఆధారంగా కంబోడియాలో జరిగినట్లు తెలుస్తుంది. పిప్‌సర్‌ అనే మహిళ ఒక పిల్లాడిని ఎత్తుకుని నిల్చుని ఉంటుంది. అక్కడే ఒక గదిలో మరో ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. ఆడుకుంటూ కనిపించారు. ఇద్దరు కాస్త పెద్దవారు కాగా.. మరో బాబు బాగా చిన్నవాడు. నడక చైర్‌లో నిల్చోబెట్టారు. అయితే.. ఉన్నట్లుండి ఏదో శబ్ధం వచ్చింది. దాంతో వెంటనే ఇద్దరు పిల్లలతో పాటు తల్లి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. కానీ.. వాక్‌ చైర్‌లో ఉన్న పిల్లాడు మాత్రం అక్కడే ఉండిపోయాడు. అంతో పైకప్పు కూలిపోవడాన్ని గమనిస్తుంది తల్లి. వెంటనే స్పందించి చివరి క్షణంలో వాక్‌ చైర్‌లో ఉన్న బాబుని పక్కకు లాగుంది. పిల్నాడ్ని అలా పక్కకు లాగిన మరుక్షణమే పైకప్పు కూలి కిందపడిపోతుంది. ఇదంతా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఆమె చురుకుగా స్పందించిన తీరుని అభినందిస్తున్నారు.

పిల్లాడిని కాపాడిన తల్లి మాట్లాడుతూ.. ఇంటి పైకప్పు తమపై కాస్తుంటే పడిపోయేదని చెప్పింది. అలా జరిగే తమ ప్రాణాలు కోల్పోయేవారమని తెలిపింది. ప్రమాదాన్ని గమనించి చివరి క్షణంలో పరుగుపరుగున బయటకు వచ్చామని వివరించింది. ఇదే ఘటనపై స్పందించిన ఇంటి యజమాని వాటర్ ప్రూఫింగ్ సరిగా జరగలేదని చెప్పారు. భారీ వర్షాల కారణంగానే పైకప్పు కూలిందని అన్నారు. అయితే.. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు.

Next Story