Video: రెడ్‌ రిబ్బన్‌ కట్టలేదని.. ఉద్యోగిపై ఎమ్మెల్యే దాడి

శంకుస్థాపన కార్యక్రమానికి రెడ్‌ రిబ్బన్‌ కట్టలేదని ఓ వ్యక్తిని ఎమ్మెల్యే కొట్టాడు. అస్సాం రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

By అంజి
Published on : 21 March 2025 12:09 PM IST

AIUDF MLA, Shamsul Huda, red ribbon , tall banana tree, foundation stone laying event

Video: రెడ్‌ రిబ్బన్‌ కట్టలేదని.. ఉద్యోగిపై ఎమ్మెల్యే దాడి

శంకుస్థాపన కార్యక్రమానికి రెడ్‌ రిబ్బన్‌ కట్టలేదని ఓ వ్యక్తిని ఎమ్మెల్యే కొట్టాడు. అస్సాం రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తూర్పు బిలాసివర AIUDF ఎమ్మెల్యే సంసుల్‌ హుడా చువాపాటా దైఖోవా మార్కెట్ వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు. శంకుస్థాపన కార్యక్రమానికి జరిగిన ఏర్పాట్లపై హుడా అసంతృప్తి చెందాడు. రిబ్బన్ రంగు, అరటి చెట్ల పరిమాణాన్ని చూసి అతను కోపంగా ఉన్నాడు .కాంట్రాక్టర్‌ వద్ద పని చేసే ఉద్యోగి రెండు అరటి చెట్లకు పింక్‌ రిబ్బన్‌ కట్టారు. దీంతో రెడ్‌ రిబ్బన్‌ కట్టలేదని ఆగ్రహించిన ఎమ్మెల్యే.. కాంట్రాక్టర్ ఉద్యోగిని కాలర్ పట్టుకుని లాగి గట్టిగా కొట్టాడు. అతను అంతటితో ఆగలేదు. అరటి చెట్టుతో పెకిలించి ఉద్యోగిపై దాడి చేశాడు. అక్కడ నిలబడి ఉన్న వ్యక్తులు అతన్ని ఆపడానికి ప్రయత్నించారు.

ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిన తరువాత, కాంట్రాక్టర్ అవినాష్ అగర్వాలా ఏర్పాటులో జరిగిన లోపాలకు ఆయన నుండి క్షమాపణలు కోరారు. అయితే ఓ ప్రజాప్రతినిధి ఉద్యోగుల పట్ల ఇలా ప్రవర్తించడమేంటని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఎమ్మెల్యే చర్యపై తీవ్ర విమర్శలు వచ్చాయి, ఆ తర్వాత ఆయన క్షమాపణలు చెప్పారు. తన చర్యకు క్షమాపణలు చెబుతూ, హుడా ఇలా జరగకూడదు కానీ తాను అలా చేయవలసి వచ్చిందని అన్నారు. "నేను బహిరంగంగా అలా చేయడం సరైనది కాదు. కానీ వాతావరణం నన్ను బలవంతం చేసింది. కాబట్టి జరిగిన దానికి అస్సాం ప్రజలందరికీ మరియు బిలాసిపారా ప్రజలకు నేను క్షమాపణలు కోరుతున్నాను" అని హుడా అన్నారు.

Next Story