మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్‌.. అందుకేనట..!

మొసలిని పెళ్లి చేసుకున్నాడు మెక్సిన్ మేయర్. అంగరంగ వైభంగా వేడుకను జరిపించారు.

By Srikanth Gundamalla  Published on  2 July 2023 1:42 PM IST
mexican mayor, married, alligator, Viral video,

మొసలిని పెళ్లి చేసుకున్న మేయర్‌.. అందుకేనట..!

మొసలితో పెళ్లి ఏంటని ఆశ్చర్యపోకండి. ఇది ఫేక్‌ న్యూస్‌ అని కూడా కొట్టిపారేయొద్దు. ఎందుకంటే ఇది నిజంగానే జరిగింది. మొసలిని మేయర్‌ పెళ్లాడటం వెనుక కారణం కూడా లేకపోలేదు. ఈ వింత పెళ్లి వెనుక కథేంటో చూద్దాం..

వర్షాలు పడకపోతే కప్పల పెళ్లిళ్లు చేస్తారు పెద్దలు. ఇదంతా మనకు తెలిసిందే. కొందరైతే చెట్టుకి, మనిషికి పెళ్లి చేస్తారు. కానీ మొసలిని పెళ్లి చేసుకోవడం ఏంటి..? మొసలి ఎంత ప్రమాదకరమో అందరికీ తెలుసు. అలాంటి ప్రాణితో వివాహం చేసుకున్నాడు మెక్సికన్ మేయర్‌ హ్యూగో సోసా. అది కూడా సాంప్రదాయ పద్ధతిలో అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరిపించారు. పెళ్లి కోసం ఒక మొసలిని పట్టుకొచ్చారు అక్కడి పెద్దలు. ఆ తర్వాత వివాహ వేడుకలో అందంగా కనిపించేందుకు దాన్ని ముస్తాబు చేశారు. తెల్లటి దుస్తులను మొసలిపై కప్పి పెళ్లికి రెడీ చేశారు. ఇక మేయర్‌ హ్యుగో సోసా మొసలిని ఎత్తుకుని.. ముద్దుపెట్టి పెళ్లాడారు. ఆ తర్వాత పెళ్లికి హాజరైన వారంతా పాటలు పెట్టి డ్యాన్సులు చేశారు. వేడుక అనంతరం ట్రంపెట్లు ఉదుతూ.. డప్పులు వాయిస్తూ మొసలిని వీధుల్లో ఊరేగించారు కూడా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వర్షాల కోసం ప్రకృతిని వేడుకుంటూ పూజ చేయడమే ఈ వివాహ వేడుక అంతరార్థమనట. ఇది తమ ఆచారమని.. ఎన్నో ఏళ్ల క్రితం నుంచే ఇది కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. అందరి బాగు కోసం మెక్సికన్ మేయర్ పురాతన సంప్రదాయలను గౌరవిస్తూ మొసలిని పెళ్లాడారు. నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి రకరకాలుగా కామెంట్స్‌ పెడుతున్నారు.

Next Story