మ్యాట్రిమోనియల్‌లో వరుడి కోసం యువతి ప్రకటన.. డిమాండ్లు మామూలుగా లేవుగా
Matrimonial Ad Of Bride Seeking Groom Gone Viral.అమ్మాయి లేదా అబ్బాయిలు తమ జీవితభాగస్వామిని మ్యాట్రీమోనియల్
By తోట వంశీ కుమార్ Published on 19 Oct 2022 3:13 PM ISTఒకప్పుడు పెళ్లిళ్ల పేరయ్యలు సంబంధాలు కుదుర్చేవారు. ఫలానా చోట అమ్మాయి లేదా అబ్బాయి ఉన్నాడని చెప్పి ఇరు కుటుంబాల మధ్య మధ్యవర్తిత్వం వహించి వివాహాలు జరిపించేవారు. టెక్నాలజీ పుణ్యమా అని ప్రస్తుతం మ్యాట్రీమోనియల్ సైట్లు అందుబాటులోకి వచ్చాయి. అమ్మాయి లేదా అబ్బాయిలు తమకు నచ్చిన జీవితభాగస్వామిని మ్యాట్రీమోనియల్ సైట్ల ద్వారా ఎంపిక చేసుకుంటున్నారు.
అలా.. ఓ యువతి తన కాబోయే వరుడు ఎలా ఉండాలి, అతడి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలి, వయస్సు, జీతం, ఎత్తు, అతడి నుంచి ఆమె ఏం కోరుకుంటుందో చెబుతూ ఓ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసింది. ఆ యువతి ప్రొఫైల్ చూసిన చాలా మంది యువకులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. కొందరు ఆమె ప్రొఫైల్ స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.
ఎలాంటి వరుడు కావాలంటే..?
జూన్ 1992 తరువాతే జన్మించి ఉండాలి. డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ ఏం చదివినా ఫర్వాలేదు. అయితే.. ఆ డిగ్రీలు తప్పనిసరిగా దేశంలోనే పేరున్న విద్యాసంస్థల్లో అయి ఉండాలి. ఐఐటీ, ఐఐఎం, బిట్స్ పిలానీ, ఐఐఎస్‌సీ, డీటీయూలు హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, బాంబే , ఢిల్లీ, రూర్కీ, ఖగర్‌పూర్ ఇలా ముఖ్యనగరాల యూనివర్సీల నుంచి పొందాలట. సదరు కాలేజీల జాబితాను కూడా ఆ యువతి కుప్లంగా పొందుపరిచింది.
అంతేకాదండోయ్ ఏడాదికి కనీసం రూ.30లక్షల జీతం ఉండాలట. మరీ ముఖ్యంగా కార్పొరేట్ సెక్టర్‌లోనే పని చేస్తుండాలట. ఇక వరుడికి తోబట్టువులు ఇద్దరి కంటే ఎక్కువగా ఉండొదట. బాగా చదువుకున్న కుటుంబం అయితే ప్రాధాన్యం ఇస్తుందట. ఇక వరుడి ఎత్తు 5.7 అడుగుల నుంచి 6 అడుగులు ఉండాలట.
What is your take on this? pic.twitter.com/FWO1YGyxge
— Dr.D G Chaiwala (@RetardedHurt) October 17, 2022
దీన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి చేసుకుంటుందా..? లేదా భర్తను హైర్ చేసుకుంటుందా అని కామెంట్లు పెడుతున్నారు. ఒకవేళ ఓ అబ్బాయి ఇలా పోస్టు పెడితే ఎంతటి వివాదం చెలరేగి ఉండేదో ఓ సారి ఊహించుకోండి అంటూ ఇంకో నెటీజన్ అభిప్రాయపడ్డాడు.