మొసలి వేషం ధరించి.. మొసలితోనే ఆటలు.. వీడియో వైరల్‌

Man wears crocodile costume, touches reptile's leg in shocking video. ఇంటర్నెట్‌లో వింత వీడియోల కంటెంట్‌కు కొరత లేదు. తాజా వీడియో దీనికి సరైన ఉదాహరణ అ

By అంజి  Published on  11 Dec 2022 5:14 AM GMT
మొసలి వేషం ధరించి.. మొసలితోనే ఆటలు.. వీడియో వైరల్‌

ఇంటర్నెట్‌లో వింత వీడియోల కంటెంట్‌కు కొరత లేదు. తాజా వీడియో దీనికి సరైన ఉదాహరణ అని చెప్పొచ్చు. మొసలి వేషధారణలో ఓ వ్యక్తి నది ఒడ్డున ఉన్న మొసలి కాళ్లను తాకుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది దావానలంలా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు అందుతున్నాయి. నరేంద్ర సింగ్ అనే ట్విటర్ వినియోగదారు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను పంచుకున్నారు.

10 సెకన్ల వీడియో క్లిప్‌లో ఒక వ్యక్తి మొసలి వేషంలో కనిపించాడు. అతను నది ఒడ్డున ఒక మొసలి పక్కన నేలపై పడుకున్నాడు. అతను మొసలి కాలును నెమ్మదిగా లాగి, దానిని తరచుగా తాకాడు. అదృష్టవశాత్తూ.. మొసలి అతని చర్యలకు ప్రతిస్పందించలేదు. దీనిపై నెటిజన్లు రెండు గ్రూపులుగా విడిపోయి కామెంట్స్ సెక్షన్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.


Next Story