మెట్రోలో టవల్‌తో యువకుడు ఎంట్రీ.. వీడియో వైరల్‌

Man walking in Delhi metro wearing towel.. video viral. నేటి యువతకు సోషల్‌ మీడియాలో రీళ్లు చేయడంపై బాగా మోజు పెరిగింది. వైరల్‌ రీళ్ల కోసం ఏం చేయడానికైనా

By అంజి  Published on  9 Dec 2022 11:23 AM IST
మెట్రోలో టవల్‌తో యువకుడు ఎంట్రీ.. వీడియో వైరల్‌

నేటి యువతకు సోషల్‌ మీడియాలో రీళ్లు చేయడంపై బాగా మోజు పెరిగింది. వైరల్‌ రీళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. చొక్కా, టవల్ ధరించి మెట్రో రైలులోకి ఎక్కిన ఓ యువకుడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఢిల్లీ మెట్రో రైలు లోపల ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పటికీ చాలా మంది రీల్స్‌ చేస్తున్నారు. తాజా ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

మోహిత్ గౌహర్ అనే వ్యక్తి చొక్కా ధరించి, కాళ్లకు టవల్ చుట్టుకుని మెట్రో రైలులోకి ప్రవేశించాడు. యువకుడు మెట్రోలో అద్దంలో చూసుకుంటూ హాయిగా తన జుట్టును అలంకరించుకున్నాడు. కొన్నిసార్లు అతను వింత పనులు చేస్తూ కనిపించాడు. వైరల్ వీడియోలో.. అతను రైలు లోపల నడుస్తూ కనిపించాడు. అతడిని చూసి ప్రజలు నవ్వుతూ కనిపించారు. చాలా మంది మౌనంగా ఉన్నారు. 'ట్యాంక్‌లో నీళ్లు లేవు, ఈ రోజు నేను ఆఫీసులో స్నానం చేస్తాను' అని అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు. యూజర్లు ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


Next Story