ఘోరం.. టోల్‌ఫీజు అడిగిన మహిళను కారుతో ఢీకొట్టిన వ్యక్తి (వీడియో)

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మానవత్వాన్ని మరిచి వ్యవహించాడు.

By Srikanth Gundamalla  Published on  14 May 2024 6:06 AM GMT
man,   lady,  car, toll plaza, uttar pradesh,

ఘోరం.. టోల్‌ఫీజు అడిగిన మహిళను కారుతో ఢీకొట్టిన వ్యక్తి (వీడియో)

ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మానవత్వాన్ని మరిచి వ్యవహించాడు. టోల్‌ ఫీజు ఇవ్వాలని అడిగినందుకు క్రూరంగా ప్రవర్తించాడు. ఓ మహిళా సిబ్బందిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు. ఢిల్లీ-మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సదురు కారు డ్రైవర్‌ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ నుంచి ఎక్స్‌ప్రెస్‌ వేపై ఓ కారు వచ్చింది. కాశీ టోల్‌ ప్లాజా వద్దకు రాగానే.. టోల్‌ ప్లాజా సిబ్బంది కారును ఆపారు. విధుల్లో భాగంగా టోల్‌ ఫీజు కట్టాలని సూచించారు. ఫాస్టాగ్‌ లేదు అనీ.. డబ్బులు చెల్లిస్తేనే తాము ముందుకు వెళ్లేందుకు గేట్‌ తీస్తామని చెప్పారు. దాంతో.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆ కారు డ్రైవర్‌. మహిళా ఉద్యోగినితో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న మిగతా సిబ్బంది వచ్చి అతడికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. కారు ఎదురుగా ఒక మహిళా సిబ్బంది నిల్చుంది. ఆమెను ఢీకొంటూ కారును ముందుకు తీసుకెళ్లాడు. కొంత దూరంపాటు మహిళను ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు.

దీనిపై స్పందించిన టోల్‌ప్లాజా మేనేజర్‌ అనిల్‌ శర్మ.. ఈ సంఘటనలో తమ మహిళా సిబ్బంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. టోల్‌ ఫీజు అడిగితేనే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ నిలదీశాడు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అంటే.. అధికారులు సదురు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాశీ టోల్‌ ప్లాజా మేనేజర్ అనిల్‌ డిమాండ్ చేశాడు.


Next Story