హెల్మెట్‌ ధరించాలన్నందుకు ట్రాఫిక్‌ పోలీస్‌ వేలు కొరికిన వ్యక్తి

హెల్మెట్‌ ఎందుకు ధరించలేదని అడిగినందుకు పోలీసుల చేతి వేలిని కొరికాడు ఓ వ్యక్తి.

By Srikanth Gundamalla  Published on  13 Feb 2024 5:32 PM IST
man, bite, traffic constable, hand, viral video,

హెల్మెట్‌ ధరించాలన్నందుకు ట్రాఫిక్‌ పోలీస్‌ వేలు కొరికిన వ్యక్తి  

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని... తద్వారా సురక్షితంగా ఉండొచ్చని ట్రాఫిక్‌ పోలీసులతో పాటు ప్రభుత్వ అధికారులు నిత్యం చెబుతుంటారు. కానీ కొందరు ఆకతాయిలు వీటిని అస్సలు పట్టించుకోరు. ట్రాఫిక్‌ రూల్స్‌ను అతిక్రమించి ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటారు. కొన్నిసార్లు వారి ప్రాణాలపైకి తెచ్చుకుంటే.. ఇంకొన్ని ఘటనల్లో ఎదుటివారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. అయితే.. బైక్‌పై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని పోలీసులు నిత్యం చెబుతుంటారు. అలాగే కర్ణాటకలో కూడా ఒక బైక్‌ వాహనదారుడికి చెప్పారు పోలీసులు. అంతే అతను ఎక్కడ లేని కోపం తెచ్చుకుని అనుచితంగా ప్రవర్తించాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ వేలిని కొరికేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

బెంగళూరులో చోటుచేసుకుంది ఈ సంఘటన. విల్సన్ గార్డెన్ 10వ క్రాస్‌ దగ్గర సయ్యద్ సఫీని ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. హెల్మెట్ ధరించకుండా బైక్‌ నడుపుతున్నందుకు ప్రశ్నించారు. ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించాలని.. త్వద్వారా క్షేమంగా ఇంటికి వెళ్లొచ్చని చెప్పుకొచ్చారు. అయితే.. ఆస్పత్రికి వెళ్తున్నాననీ.. ఈ క్రమంలోనే హెల్మెట్ మర్చిపోయానని అతను వివరించే ప్రయత్నం చేశాడు.

మరోవైపు హెడ్‌ కానిస్టేబుల్ సిద్దరామేశ్వర కౌజాలగి హెల్మెట్‌నిబంధన ఉల్లంఘించినందుకు రికార్డు చేసే ప్రయత్నం చేశాడు. దాంతో ఆగ్రహానికి గురైన బైకర్ సయ్యద్‌ ట్రాఫిక్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ వద్ద ఫోన్ లాక్కున్నాడు.. వీడియో రికార్డు చేయొద్దంటూ ఫైర్ అయ్యాడు. అలాగే తన వీడియో వైరల్ అయినా కూడా తనకు ఎలాంటి ఫరక్‌ పడదంటూ మాట్లాడాడు. దాంతో.. పోలీసులు బైక్‌ పక్కకు తీయాలంటూ అతడి బైక్‌ కీస్‌ను తీసుకున్నారు. వాటిని తిరిగి లాక్కునే క్రమంలో సదురు వ్యక్తి పోలీసు చేతి వేలిని కొరికాడు. ఇదంతా అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. కాగా.. పోలీసు సిబ్బందిపై దాడి చేయడం.. దుర్భాషలాడటం, నేరపూరిత బెదింరిపుల కింద సయ్యద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు.


Next Story